కామెడీ సినిమాల‌కు రేటింగులు ఇవ్వ‌కూడదా?

రివ్యూల‌పై మ‌రో ద‌ర్శ‌కుడికి కోపం వ‌చ్చింది. `రాసేవాళ్లు సినిమాలు తీయండి.. ఆస్కార్‌కి పంపించుకోండి. అవార్డులు కొట్టండి` అని వీర‌లెవిల్లో స్పీచులు ఇచ్చారు. ఆ ద‌ర్శ‌కుడే.. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి. ఆయ‌న కోపానికి రీజ‌న్ ఏమిటంటే.. ఆయ‌న ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన `తెనాలి రామ‌కృష్ణ బిఏ బిఎల్‌` కి స‌రైన రేటింగులు రాలేదు. ఈ సినిమాలో విష‌యం లేద‌ని స‌మీక్ష‌కులంతా తేల్చేశారు.

దాంతో నాగేశ్వ‌ర‌రెడ్డి చిందులు తొక్కారు. సినిమా విడుద‌లై నాలుగ్గంట‌లు కాక‌మునుపే ప్రెస్ మీట్ పెట్టి `మా సినిమా హిట్టు` అని చెప్పుకున్న నాగేశ్వ‌రరెడ్డి – రివ్యూలు మాత్రం బ్యాడ్‌గా వ‌చ్చాయ‌ని ఫీల‌య్యారు. మేం శంక‌రాభ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం సినిమాలు తీయ‌లేద‌ని, ఇది అవార్డు సినిమా కాద‌ని, కేవ‌లం న‌వ్వించ‌డానికే సినిమాలు తీశామ‌ని, న‌వ్వుల సినిమాకి రేటింగు ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కామెడీ సినిమాల‌కు రేటింగులు వద్ద‌న్న‌ది నిజంగా మితండ వాద‌న‌. ఏ సినిమాకైనా విమ‌ర్శ‌కుల‌కంటూ ఓ దృష్టి కోణం ఉంటుంది. ఆ కోణంలోంచే చూస్తారు. రేటింగులు ఇస్తారు. రివ్యూలంటే ఇష్టం లేనప్పుడు `అస‌లు రివ్యూలెందుకు` అని అడ‌గొచ్చు. అందులో అర్థం ఉంటుంది. కానీ… ఫ‌లానా సినిమాల‌కు రేటింగులు ఇవ్వ‌కూడ‌దు అని మాత్రం చెప్ప‌కూడ‌దు. పైగా నాగేశ్వ‌ర‌రెడ్డి తీసిన‌వ‌న్నీ కామెడీ సినిమాలే. కొన్ని హిట్ట‌య్యాయి. కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు కూడా రేటింగుల గురించి ఈయ‌న ఇలా మాట్లాడ‌లేదే..? సినిమాలో విష‌యం ఉంటే, నిజంగా నాగేశ్వ‌రెడ్డి చెప్పిన‌ట్టు థియేట‌ర్లో జ‌నం ప‌గ‌ల‌బ‌డిన‌వ్వుతుంటే, ఈ రేటింగులు ఈ సినిమాని ఆప‌లేవు. రెండ్రోజులు ఆగితే, బాక్సాఫీసు క‌ల‌క్ష‌న్లే అస‌లు నిజాన్ని బ‌య‌ట పెడ‌తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రొమాంటిక్ రాధేశ్యామ్‌

జాన్‌- రాధేశ్యామ్‌.. ఈ రెండింటిటో ప్ర‌భాస్ టైటిల్ ఏమిట‌న్న ఉత్కంఠ‌త‌కు తెర ప‌డింది. చిత్ర‌బృందం రాధే శ్యామ్‌పైనే మొగ్గు చూపించింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల...

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన... వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు....

దూబే హతం..! బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే ఆన్సర్..!

యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అతనిని కాపాడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. మరో విమర్శకు తావివ్వకుండా...యూపీ శివార్లలోనే ఎన్‌కౌంటర్ చేసేశారు. డీఎస్పీ...

HOT NEWS

[X] Close
[X] Close