జూనియర్‌ను వాడేసుకుని మంచి చేస్తున్నారా..? చెడా..?

ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సహజంగా వచ్చే ఇబ్బందులన్నింటినీ ఇప్పుడు టీడీపీ చూస్తోంది. గతంలో వైసీపీకి.. టీడీపీ ఇలాంటి పరిస్థితి కల్పించింది. ఇప్పుడు వైసీపీ.. ఆ పని చేస్తోంది. అదంతా పొలిటికల్ సైకిల్. కానీ.. టీడీపీని వీడేవాళ్లు… జూనియర్ ఎన్టీఆర్‌ను సీన్‌లోకి తీసుకొస్తున్నారు. ఆయనను టీడీపీలో పక్కన పెట్టారని.. అదని.. ఇదని వాదిస్తున్నారు. జూనియర్ 2009 ఎన్నికల కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన సినిమాలకే పరిమితమయ్యారు. పార్టీ వైపు రాలేదు. అంతర్గతంగా సమస్యలున్నాయో… లోకేష్‌ను పెంచడానికి చంద్రబాబే పక్కన పెట్టారో.. ఎవరికీ తెలియదు. ఇంత కాలం.. మాట్లాడని వారు.. ఇప్పుడు.. బయటకు వెళ్తూ.. జూనియర్ ఎన్టీఆర్‌ను పొగుడుతున్నారు. చంద్రబాబును తిడుతున్నారు. ఇక్కడే తేడా కొడుతోంది.

2009 ఎన్నికల తర్వాత గతంలో.. వైఎస్ ఆకర్ష్‌లో భాగంగా… కొడాలి నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి వాళ్లు టీడీపీ నుంచి వెళ్లిపోయారు. అప్పుడు కూడా వారు.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. కొంత మంది బాలకృష్ణ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు వల్లభనేని వంశీ.. మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తున్నారు. పదేళ్ల పాటు పార్టీలో ఉండి.. జూనియర్ కు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని ఒక్క మాట కూడా మాట్లాడని.. వంశీ.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత… ఎందుకు.. జూనియర్ ప్రస్తావన తెస్తున్నారనేది ఆసక్తికరం.

కొడాలి నాని, వంశీలకు జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడనే ప్రచారం ఉంది. వీరు బయటకు వెళ్లి.. వైసీపీలో ఉండి.. జూనియర్ ఎన్టీఆర్ ను పదే పదే రాజకీయంగా ప్రస్తావనకు తీసుకు రావడం వల్ల ఎవరికి లాభం..? వారికి తాత్కలికంగా లాభం కలుగుతుందేమో కానీ.. జూనియర్ ఎన్టీఆర్‌కు కాదు. వీరి వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని.. ఆయనే వైసీపీలోకి పంపుతున్నారన్న ప్రచారం .. ఇప్పటికే జరుగుతోంది. అలా జరగితే.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్‌కే ఇబ్బంది. ఆయన ఇప్పటి వరకూ రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు. కానీ.. టీడీపీ ఫ్యూచర్‌లో ఆయనకూ పాత్ర ఉంటుందని ఫ్యాన్స్ ఇప్పటి వరకూ నమ్మారు. కానీ తమ రాజకీయ జీవితాల కోసం.. అలాంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు.. ఆయన స్నేహితులు. జూనియర్ మామ కూడా వైసీపీలోనే ఉన్నారు. ఈ పరిణామాలు జూనియర్‌కు నష్టం చేస్తాయి కానీ లాభం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close