పెళ్లిళ్లు జరుగుతున్నాయిగా..? మాంద్యం ఎక్కడుంది..?

దేశాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిందని… ప్రజలకు ఆదాయ మార్గాలు పడిపోయాయని.. ఆ ప్రభావం వినియోగ వస్తువుల కొనుగోళ్లలో కనిపిస్తోందని.. ఆర్థిక నిపుణులు గగ్గోలు పెడుతున్నారు. కేంద్రానికి జీఎస్టీ ఆదాయం.. 30 శాతం వరకూ పడిపోయిందని.. గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని సరిదిద్దడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వారానికో వరం ప్రకటిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి ఉపయోగపడతాయంటూ.. తాయిలాలు ప్రకటింస్తున్నారు. ఆటోమోబైల్ నుంచి రియల్ ఎస్టేట్ వరకూ.. పన్ను మినహాయింపులు ఇస్తున్నారు. కొత్తగా మూలధనం సమకూరుస్తున్నారు. అయితే.. కేంద్రమంత్రుల్లో మరికొందరు మాత్రం.. ఆర్థిక మాంద్యం లేదనడానికి సరికొత్త ప్రమాణాలు నిర్దేశించుకుంటున్నారు.

రైళ్లన్నీ ఫుల్‌గా ఉన్నాయి, పెళ్లిళ్లు బాగా చేసుకుంటున్నారు.. ఎయిర్‌పోర్టులు కూడా రద్దీగా ఉన్నాయి, ఇక ఆర్థికమాంద్యం ఎక్కడిదని… రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్‌ అంగడి నేరుగా మీడియాను ప్రశ్నించారు. ఆర్థిక మాంద్యం అంటూ.. అందరూ మోడీ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తేల్చేశారు. మంత్రిగారి దృష్టిలో ఆర్థిక మాంద్యం ఉంది కాబట్టి.. రైళ్లలో వెళ్లకూడదు… విమానాల్లో ప్రయాణించకూడదు.. పెళ్లిళ్లు కూడా చేసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే.. కడుపు నిండా తిండి తిన్నా కూడా.. ఆర్థిక మాంద్యం లేనట్లేనని.. ఆయన భావిస్తూ ఉండి ఉంటారు. రోజువారీ అవసరాలకు ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కాబట్టి.. ఆర్థిక మాంద్యం లేదనేది.. అంగడి వాదనలా ఉంది.

ఈయనే కాదు.. కొద్ది రోజుల క్రిందట.. రవిశంకర్ ప్రసాద్ కూడా.. చిత్రవిచిత్రంగా.. ఆర్థిక మాంద్యం లెక్కలు వినిపించారు. కొద్ది వారాల కిందట.. ఒకే రోజు మూడు సినిమాలు విడుదలయ్యాయి. వాటికి హిట్ టాక్ వచ్చింది. పండగ సీజన్ కాబట్టి.. మూడింటికి కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీన్ని చూపించిన రవిశంకర్ ప్రసాద్.. ఆర్థిక మాంద్యం ఎక్కడుందని ప్రశ్నించారు. తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో.. అప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఆ బాధ్యత మరో మంత్రి తీసుకున్నారు. మొత్తానికి.. ఆర్థిక మాంద్యాన్ని కొలవడానికి కేంద్రమంత్రులు సరికొత్త ప్రమాణాలను నిర్దేశించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close