డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ – బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది. ఈ రేసులో ఇంద్ర సినిమా కూడా ఉంది. ఇప్పుడు `శివ‌` కూడా చేర‌బోతోంది. రీ రిలీజ్ ట్రెండ్ గురించి నాగార్జున మాట్లాడుతూ శివ‌ని రీ రిలీజ్ చేసే ఆలోచ‌న ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

”శివ‌ని డిజిట‌ల్‌లో రిలీజ్ చేద్దామనుకొంటున్నాం. ఆ ప్రోసెస్ జ‌రుగుతోంది. కొన్ని రీల్స్ మిస్స‌య్యాయి. వాటిని వెదికే ప‌నిలో ఉన్నారు. శివ అనే కాదు… నా హిట్ సినిమాలు చాలా వ‌ర‌కూ రీ రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ ఉంది. అయితే… కొన్నింటికి రీల్స్ దొరక‌డం క‌ష్ట‌మైపోయింది” అన్నారు నాగ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన `ది ఘోస్ట్` రేపు (బుధ‌వారం) విడుద‌ల అవుతోంది. ఈ సినిమాపై నాగ్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. ”ది ఘోస్ట్ నాకు అన్ని ర‌కాలుగా సంతృప్తి ఇచ్చింది. శివ సినిమా విడుద‌లైన రోజే.. ఘోస్ట్ కూడా వ‌స్తోంది. ఆ సెంటిమెంట్ క‌లిసొస్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నా. టెక్నిక‌ల్ గా శివ గురించి ఎలా మాట్లాడుకొన్నారో… ఘోస్ట్ గురించి కూడా అలానే మాట్లాడుకొంటారు” అని చెప్పుకొచ్చాడు నాగ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close