జాక్ పాట్ కొట్టిన నాగ్‌

వ‌రుస ఫ్లాపుల త‌ర‌వాత నాగార్జున‌కు `నా సామిరంగ‌`తో కాస్త జోష్ వ‌చ్చింది. సంక్రాంతికి విడుద‌లైన ‘నా సామిరంగ‌’ అక్కినేని ఫ్యాన్స్‌ని సంతోష పెట్ట‌డ‌మే కాకుండా, నాగార్జున‌ నమ్మ‌కాన్ని నిల‌బెట్టింది. ఈ సినిమా విడుద‌లకు ముందే నిర్మాత‌కు టేబుల్ ప్రాఫిట్ వ‌చ్చింది. ఓటీటీ, శాటిలైట్ మంచి రేటుకి అమ్ముడ‌య్యాయి. విడుద‌ల‌కు వారం రోజుల ముందు వర‌కూ ‘నా సామి రంగ’ వ‌చ్చేది డౌటే. ఆఘ‌మేఘాల మీద సినిమా పూర్తి చేయాల్సివ‌చ్చింది. సంక్రాంతికి ఇన్ని సినిమాల మ‌ధ్య సినిమాని విడుద‌ల చేయ‌గ‌ల‌మా? అంటూ నిర్మాత సందేహిస్తున్న వేళ‌.. నాగార్జున ధైర్యం చేసి, ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ ని రూ.15 కోట్ల‌కు సొంతం చేసుకొన్నారు. ఒక్క రూపాయి కూడా అడ్వాన్సు తీసుకోకుండా అన్ని చోట్లా సొంతంగా విడుద‌ల చేశారు.

ఇప్పుడు థియేటర్ నుంచి దాదాపుగా రూ.20 కోట్లు వెన‌క్కి వచ్చింది. అంటే రూ.5 కోట్ల లాభ‌మ‌న్న‌మాట‌. ఓ వైపు ‘హ‌నుమాన్‌’ మ‌రోవైపు ‘గుంటూరు కారం’ వ‌సూళ్ల‌తో హోరెత్తుతోంటే, నాగ్ సినిమా ఈ రేంజ్‌లో వ‌సూళ్లు తెచ్చుకోవ‌డం, అందులోనూ త‌క్కువ థియేట‌ర్లు ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డి వెన‌క్కి తెచ్చుకోవ‌డ‌మే కాకుండా లాభాలు సాధించ‌డం మామూలు విష‌యం కాదు. అందుకే నాగార్జున ఈ సినిమా ఫ‌లితం ప‌ట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. త్వ‌ర‌లోనే చిత్ర‌బృందానికి నాగ్ ఓ భారీ విందు ఇవ్వ‌బోతున్న‌ట్టు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close