బ‌న్నీ – బోయ‌పాటి.. క‌థ ఓకే!

‘పుష్ప 2’ త‌ర‌వాత‌ అల్లు అర్జున్ ముందు చాలా ఆప్ష‌న్స్ ఉన్నాయి. త్రివిక్ర‌మ్‌, అట్లీ బ‌న్నీ కోసం క‌థ‌లు సిద్థం చేస్తున్నారు. ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సైతం బ‌న్నీకి ట‌చ్‌లో ఉన్నాడు. ఇప్పుడు బోయ‌పాటి శ్రీ‌ను కూడా బ‌న్నీకి ఓ క‌థ చెప్పి `ఓకే` చేయించుకొన్నాడు. బ‌న్నీ – బోయ‌పాటిది హిట్ కాంబో. వీరిద్ద‌రి నుంచి `సరైనోడు` వచ్చింది. అప్ప‌టికి బ‌న్నీ కెరీర్‌లో ‘స‌రైనోడు’ పెద్ద హిట్. ఆ రికార్డుల్ని ఆ త‌ర‌వాత ‘అల వైకుంఠ‌పుర‌ములో’ బ్రేక్ చేసింది. అప్ప‌టి నుంచీ బ‌న్నీ -బోయ‌పాటి రెండో సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. బోయ‌పాటి కూడా బ‌న్నీని దృష్టిలో ఉంచుకొని ఓ ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్టు సిద్ధం చేశారు. ఇటీవ‌లే.. బ‌న్నీకి వినిపిస్తే.. ఆయ‌న ‘ఓకే’ చెప్పేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ తెర‌కెక్కించ‌నుంద‌ని టాక్.

బోయ‌పాటితో బాల‌య్య సినిమా కూడా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. అయితే బాల‌కృష్ణ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. చాలామంది ద‌ర్శ‌కుల‌కు ఆయ‌న సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చారు. 2024 ఎన్నిక‌ల ముందు బోయ‌పాటితో సినిమా చేద్దామ‌నుకొన్నా, ఇప్పుడు అంత టైమ్ లేదు. సింహా, లెజెండ్‌, అఖండ త‌ర‌వాత వ‌చ్చే సినిమా కాబ‌ట్టి… భారీ అంచ‌నాలు ఉంటాయి. కాబ‌ట్టి… బోయ‌పాటి కూడా బాల‌య్య‌తో సినిమా విష‌యంలో పెద్ద తొంద‌ర ప‌డ‌డం లేదు. బ‌న్నీ నిర్ణ‌యం బ‌ట్టి బోయ‌పాటి త‌దుప‌రి సినిమా ఏమిట‌న్న‌ది డిసైడ్ అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close