‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!

ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు. ఈ ద‌స‌రా పండ‌గ నాగ్ ని నిరుత్సాహంలో ముంచెత్తింది. అయినా…అ ందులోనూ నాగ్ కి ఓ హ్యాపీ మూమెంట్ ఉంది. అది.. `గాడ్ ఫాద‌ర్` హిట్ అవ్వ‌డ‌మే. గాడ్ ఫాద‌ర్ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా… నాగార్జున‌కు ఓ క‌థ చెప్పాడు. అది మ‌ల్టీస్టార‌ర్‌. ఇందులో నాగార్జున‌, అఖిల్ క‌లిసి న‌టిస్తున్నారు. కాక‌పోతే.. నాగ్ ఇంకా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. `గాడ్ ఫాద‌ర్` రిజ‌ల్ట్ చూసి ముందుకెళ్లాల‌ని ఆయ‌న భావించారు. ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ హిట్ట‌వ్వ‌డంతో…నాగ్ కి మోహ‌న్ రాజాపై మ‌రింత న‌మ్మ‌కం కుదిరింది. ఈసారి.. `నో` చెప్ప‌డానికి ఆయ‌న‌కు కార‌ణాలేం లేన‌ట్టే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు రెడీగా ఉంది కాబ‌ట్టి, వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కే ఛాన్సుంది. నాగ్ మాత్రం `ది ఘోస్ట్` త‌ర‌వాత కొంత కాలం విశ్రాంతి తీసుకోవాల‌ని ఫిక్స‌య్యాడు. ఈలోగా.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి చేసుకోవొచ్చు. మ‌రోవైపు మోహ‌న్ రాజా.. మ‌హేష్ బాబుకి కూడా ఓ క‌థ చెప్పాడు. కాక‌పోతే.. అప్ప‌ట్లో వ‌ర్క‌వుట్ కాలేదు. క‌థ న‌చ్చినా మోహ‌న్ రాజాతో సినిమా చేసే స‌మ‌యం ఇప్పుడు మ‌హేష్ ద‌గ్గ‌ర లేదు. ఎందుకంటే ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తో ఓ సినిమా చేస్తున్నాడు మ‌హేష్‌. ఆ వెంట‌నే రాజ‌మౌళి సినిమా మొద‌లైపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీలో కాదు.. తెలంగాణలోనే కేసీఆర్ సభలు !

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్‌గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం...

హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా.... నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా -...

అనిల్ రావిపూడి – బాల‌య్య‌… ముహూర్తం ఫిక్స్‌

`ఎఫ్ 3` త‌ర‌వాత అనిల్ రావిపూడి సినిమా నంద‌మూరి బాల‌కృష్ణ తో ఫిక్సయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. దానికి రెండు కార‌ణాలున్నాయి. ఒక‌టి.. బాల‌య్య...

కొరియోగ్రాఫ‌ర్‌ని హీరో చేస్తున్న దిల్ రాజు

ర‌చ‌యిత‌లు మెగాఫోన్ ప‌ట్ట‌డం ఎంత కామ‌నో... డాన్స్ మాస్ట‌ర్లు డైరెక్ట‌ర్లుగా, హీరోలుగా మార‌డం కూడా అంతే కామ‌న్‌. ప్ర‌భుదేవా, లారెన్స్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌.. ఇలా హీరోలైన వాళ్లే. జానీ మాస్ట‌ర్ కూడా త్వ‌ర‌లోనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close