నాగార్జున తన కెరీర్లో కీలకమైన మైలురాయికి చేరువయ్యారు. ఆయన త్వరలోనే వందో చిత్రం చేయబోతున్నారు. తమిళ దర్శకుడు రా. కార్తీక్ చెప్పిన కథకి పచ్చజెండా ఊపారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నిజానికి నాగ్ వందవ సినిమా అంటే పెద్ద దర్శకుడు ఉంటారని భావించారు అంతా. అయితే కొత్త తరంతో సినిమాలు చేయడానికి ఇష్టపడే ఆయన మరోసారి అదే పంథాలో వెళుతూ తమిళంలో ఒకే ఒక్క సినిమాను తీసిన రా. కార్తీక్‌కి తన వందో చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను అప్పగించారు.
మరోవైపు నాగార్జున ఓ రీమేక్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది. శశికుమార్ తమిళ్లో చేసిన ‘అయోతి’ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు నాగ్. 2023లో విడుదలైన మెలోడ్రామాటిక్ సినిమా ఇది. మంత్రిరామూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్‌కి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో వున్నారు నాగ్. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా తమిళ్ మేకర్స్ నుంచి వస్తుండటం విశేషం. ఆగస్టు 29న ఆయన పుట్టినరోజు. సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.