శివ‌లో చైనూ… ఇప్పుడు క‌త్తి

ఈ ద‌స‌రాకి నాగార్జున సంద‌డి చేయ‌బోతున్నాడు .. ది ఘోస్ట్ సినిమాతో. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన యాక్ష‌న్ డ్రామా ఇది. దీనిపై నాగ్ చాలా న‌మ్మ‌కం పెట్టుకొన్నాడు. పైగా.. అక్టోబ‌రు 5… త‌న‌కు బాగా క‌లిసొచ్చింది. అక్టోబ‌రు 5నే.. `శివ‌` విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు కూడా `ఘోస్ట్`కి హిట్ ప‌డుతుంద‌ని నాగ్ న‌మ్మ‌కంతో ఉన్నాడు. అందుకే ఈ రెండు సినిమాల‌కూ పోలిక కూడా తీసుకొస్తున్నాడు. `ఘోస్ట్‌` ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు క‌ర్నూలులో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శివ‌ని మ‌రోసారి గుర్తు చేసుకొన్నాడు నాగ్.

”శివ‌లో చైను ప‌ట్టుకొచ్చా. ఆ సినిమా గొప్ప విజ‌యం సాధించింది. ఇప్పుడు ఘోస్ట్ కోసం కత్తి ప‌ట్టాను. శివ విడుద‌లైన త‌ర‌వాత సౌండ్ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకొన్నారు. ఘోస్ట్ చూశాక విజువ‌ల్స్‌, యాక్ష‌న్ గురించి కూడా అలానే మాట్లాడుకొంటారు. ఇది వ‌ర‌కు చాలా సినిమాల్లో గ‌న్స్ ప‌ట్టుకొని యాక్ష‌న్ సీన్స్ చేశా. కానీ.. ఆ సినిమాలు వేరు, ఘోస్ట్ వేరు. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా తీసుకొన్నా” అని చెప్పుకొచ్చాడు నాగ్‌. అక్టోబ‌రు 5నే విడుద‌ల కాబోతున్న మ‌రో సినిమా గాడ్ ఫాద‌ర్‌కి కూడా విజ‌యం ద‌క్కాల‌ని ఆయ‌న కోరుకొన్నారు. “నాకు అత్యంత ఆప్తుడు చిరంజీవి గారి సినిమా కూడా అదే రోజున విడుద‌ల అవుతోంది. రెండు చిత్రాల‌కూ విజ‌యం ద‌క్కాల‌“న్నారు నాగ్‌. ఇదే వేదికపై నాగ‌చైత‌న్య‌, అఖిల్‌లు కూడా సంద‌డి చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close