రిజర్వేషన్ల సుడిగుండంలో ఇరుక్కున్న కేసీఆర్ !

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలకు ముందు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో పీకే టీంను నమ్ముకోవడం ఎంత నష్టమో .. జరిగిపోయిన తర్వాత తెలుసుకున్న కేసీఆర్.. ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఆయన వేసిన అడుగు కూడా అలాంటిదేనని అర్థం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్ల జీవో జారీ చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ పది రోజులైంది. జీవో జారీ కాలేదు. న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఒక్క సారి జీవో ఇస్తే రిజర్వేషన్ల తుట్టెను కదిలించినట్లేనని అది మొత్తానికే మోసం తెస్తుందన్న ఆందోళన పార్టీలో వ్యక్తం కావడం వల్లే ఆగిందని చెబుతున్నారు.

ఎస్టీ, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ ఒకే తీర్మానం !

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధినతే కేసీఆర్ ఎస్టీలు, ముస్లింలకు చెరో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి, గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో 2017లోనే తీర్మానం చేశారు. గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ ఒకే బిల్లును కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం మాత్రం అంగీకరించలేదు. అసలు ఆ తీర్మానాన్ని పట్టించుకోలేదు.

ఇప్పుడు ఎస్టీలకు మాత్రమే జీవో ఇస్తామని ప్రకటన !

ఇప్పుడు ఇప్పుడు ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల కోసం జీవో ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఓవైసీ ముస్లింల రిజర్వేషన్ల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మజ్లిస్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముస్లిం వర్గాల మద్దతు టీఆర్ఎస్‌కు ఎంతో బాగా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారాయి. ముస్లింలకు రిజర్వేషన్ల జీవో ఇస్తే.. అది బీజేపీకి ప్రత్యేకంగా ఇచ్చిన అస్త్రం అవుతుంది.

ఎస్టీ, ముస్లింల కోసం వేర్వేరుగా జీవోలిస్తే ఇతర వర్గాల్లో నిరసన !

వీరికి రిజర్వేషన్లు కల్పిస్తే ఇతర వర్గాలు వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్నది ఇప్పుడు కేసీఆర్ ముందున్న అది పెద్ద సవాల్. ఇప్పుడు జీవో జారీ చేసి రిజర్వేషన్లను తెలంంగాణ సర్కార్ అమలు చేయవచ్చు. కేంద్రం అనుమతి అవసరం లేదు. కానీ కానీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఎవరైనా కోర్టుకు వెళ్తే రిజర్వేషన్లు ఆగిపోయే అవకాశం ఉంది. అలా ఆగిపోతే ప్రజల్లో ఆగ్రహం మరింత రెట్టింపవుతుంది. అందుకే కేసీఆర్ రిజర్వేషన్ల సమస్యను కదిలించి మరీ నెత్తి మీద పెట్టుకున్నారన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close