‘గాడ్ ఫాద‌ర్’ రిజ‌ల్ట్ కోసం.. నాగ్ వెయిటింగ్‌!

చిరంజీవి – నాగార్జున సినిమాలు రెండూ ఒకే రోజు బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి. అక్టోబ‌రు 5న గాడ్ ఫాద‌ర్ రిలీజ్ అవుతోంది. అదే రోజున నాగ్ ఘోస్ట్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఘోస్ట్ రిజ‌ల్ట్ నాగార్జున‌కు అత్యంత కీల‌కం. ఎందుకంటే ఈమ‌ధ్య నాగ్ సినిమాల‌న్నీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా కొడుతూనే ఉన్నాయి. వాటికి స‌రైన ఓపెనింగ్స్ కూడా రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో `ది ఘోస్ట్` రిజ‌ల్ట్ నాగ్ కెరీర్ తీరు తెన్నుల్ని నిర్దేశిస్తుంద‌న‌డంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే… అదే స‌మ‌యంలో నాగార్జున `గాడ్ ఫాద‌ర్` రిజ‌ల్ట్ పైనా దృష్టి పెట్టాడు. చిరు సినిమా ఫ‌లితం ఎలా ఉంటుందా? అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమాకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. గ‌త కొన్ని రోజులుగా మోహ‌న్ రాజా నాగ్ కోసం క‌థ ప‌ట్టుకొని తిరుగుతున్నాడు. నాగ్ ఈ క‌థ‌ని ఓకే చేయాలా? లేదా అనే సందిగ్థంలో ఉన్నాడు. గాడ్ ఫాద‌ర్ గ‌నుక సూప‌ర్ హిట్ అయిపోతే.. నాగ్ `నో` చెప్ప‌డానికి కార‌ణాలేం క‌నిపించ‌వు. పైగా నాగ్ తో తీసే సినిమాకి మ‌రింత బ‌జ్ వ‌స్తుంది. అందుకే `గాడ్ ఫాద‌ర్` రిజ‌ల్ట్ ఏమ‌వుతుందా? అనే ఎదురు చూపుల్లో ప‌డిపోయాడు. నాగ్ వందో సినిమా మైలు రాయికి అత్యంత స‌మీపంలో ఉన్నాడు. గాడ్ ఫాద‌ర్ హిట్ట‌యితే, వందో సినిమా బాధ్య‌త‌ని మోహ‌న్ రాజాపై పెట్టాల‌న్న‌ది నాగ్ ఆలోచ‌న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా కేసులో సీబీఐ సైలెంట్ – పులివెందుల కోర్టు యాక్టివ్ !

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. సీబీఐ బృందాలు ఏం చేస్తున్నాయో తెలియదు. విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై...

వైసీపీలోకి గంటా ! నిజమా ? బ్లాక్‌మెయిలింగా ?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని హఠాత్తుగా ఆయన అనుచరులు మీడియాకు లీకులు ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీన గంటా శ్రీనివాస్ బర్త్ డే అని ఆ రోజున ప్రకటన...

ఢిల్లీలో కాదు.. తెలంగాణలోనే కేసీఆర్ సభలు !

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్‌గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం...

హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా.... నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close