కొండా సురేఖ పై నాగార్జున కోపం తగ్గిపోయింది. సారీ చెబుతూ తాను చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ వెనక్కి తీసుకోవడంతో తాను కోర్టులో దాఖలు చేసిన కేసును విత్ డ్రా చేసుకుంటూ నాగార్జున నిర్మయం తీసుకున్నారు. సెక్షన్ 280 ప్రకారం కోర్టును అభ్యర్థించి కేసును ఉపసంహరిస్తున్నానని తెలిపారు. హైదరాబాద్ కోర్టు ఈ పిటిషన్ను అంగీకరించి, కేసును “ఉపసంహరణ మూసివేసినట్టుగా” డిస్మిస్ చేసింది.
గత ఏడాది అక్టోబర్లో కేటీఆర్ పై విమర్శలు చేస్తూ నాగార్జున కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేశారు కొండా సురేఖ. చాలా దారుణమైన , అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు విడాకులకు .. కేటీఆర్కు లింక్ చేసి అవాంఛిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొండా సురేఖ హద్దులు దాటారని విమర్శలు వచ్చాయి. తర్వాత నాగార్జున పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జున కుటుంబం కోర్టులో హాజరై వాంగ్మూలాలు ఇచ్చింది.
ఈ క్రమంలో కొండా సురేఖ నవంబర్ 12న సురేఖ సోషల్ మీడియాలో పబ్లిక్ అపాలజీ ఇచ్చారు. “నా ఉద్దేశం నాగార్జున గారు, ఆయన కుటుంబాన్ని బాధపెట్టడం కాదు. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థమయ్యాయి. క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకుంటున్నానని ను” అంటూ ట్వీట్ చేశారు. ఈ క్షమాపణ తర్వాత నాగార్జున తమ కుటుంబానికి మరింత బాధ కలిగించకుండా కేసును ముగించాలని నిర్ణయించుకున్నారు.

