బంగార్రాజు అప్ డేట్స్ ఇవే!

సోగ్గాడే చిన్ని నాయిన సినిమాకి సీక్వెల్‌గా `బంగార్రాజు` రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం స్క్రిప్టు వ‌ర్కు జ‌రుగుతోంది. జులై నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. నాగార్జున‌తో పాటు… నాగ‌చైత‌న్య కూడా ఈ చిత్రంలో న‌టించ‌నున్నాడు. అయితే ఇటీవ‌ల ఆ పాత్ర‌లో అఖిల్ క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై నాగచైత‌న్య స్పందిచాడు. “బంగార్రాజులో నాన్న‌తో పాటు నేను న‌టిస్తున్నాను. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి” అని క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాలో న‌టించ‌నున్న క‌థానాయిక‌ల్ని ఇంకా ఫైన‌లైజ్ చేయ‌లేద‌ట‌. ప్ర‌స్తుతం క‌థానాయిక‌ల కోసం అన్వేష‌ణ సాగుతోంద‌ని, త్వ‌ర‌లో వాళ్ల పేర్లు ప్ర‌క‌టిస్తామ‌ని చైతూ అంటున్నాడు. మ‌న్మ‌థుడు 2 షూటింగ్‌లో నాగార్జున బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. జులైలోపు ఆ సినిమాని పూర్తి చేయాల‌ని నాగార్జున భావిస్తున్నాడు. ఈ చిత్రంలో స‌మంత కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈఎస్ఐ స్కాం నిందితుడి నుంచి మంత్రి కుమారుడికి కారు గిఫ్ట్..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే స్వగ్రామంలో అంతర్రాష్ట్ర పేకాట క్లబ్.. దాంతో పాటు భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా.. ఈఎస్‌ఐ స్కాంలో నిందితుల నుంచి...

సీబీఐ విచారణ కావాలంటే పార్లమెంట్‌లో ధర్నాలెందుకు..!?

పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న మహాత్ముని విగ్రహం వద్ద వైసీపీకి ఉన్న పాతిక మంది ఎంపీలూ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వారి ప్లకార్డులపై మాత్రం భిన్నమైన నినాదాలున్నాయి. అమరావతి కుంభకోణంపై...

ఉపేంద్ర పేరు ఖ‌రారు చేసేసిన మెగా హీరో

వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా కిర‌ణ్ కొర్ర‌పాటి అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. అందుకోసం వ‌రుణ్ చాలానే క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఈసినిమాలో క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర...

రివ్యూ: అమ‌రం అఖిలం ప్రేమ‌

ప్రేమలో మొద‌లుపెట్ట‌డాలూ, మ‌ధ్య‌లో ఆపేయ‌డాలూ ఉండ‌వు. ఓసారి ప్రేమిస్తే.. ప్రేమిస్తూ ఉండ‌డ‌మే. అది తండ్రీ కూతుళ్ల మ‌ధ్య ప్రేమ కావొచ్చు. భార్యాభ‌ర్త‌ల ప్రేమ కావొచ్చు. అబ్బాయి, అమ్మాయి ప్రేమ కావొచ్చు. ప్రేమ‌లో క్ష‌మా...

HOT NEWS

[X] Close
[X] Close