మోడీ ఆడమన్నట్టు ఈసీ ఆడిందన్న చంద్రబాబు

రాష్ట్రంలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో సీఈసీ సునీల్ అరోరాను కలుసుకుని ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించిన తీరుని వివరించారు. ప్రధానమంత్రి మోడీ సూచనలతోనే ఆంధ్రాలో ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిదన్నారు. వైకాపా తప్పుడు ఫిర్యాదులు ఇస్తే… వాటిపై స్పందించి అధికారుల బదిలీలు చేశారనీ, కనీసం వారి వివరణ కూడా కోరకుండా బదిలీలు జరిగాయన్నారు. చివరికి, సీఎస్ ని కూడా బదిలీ చేసి… సీబీఐ కేసుల్లో ఉన్న అధికారిని తీసుకొచ్చి నియమించారని చెప్పారు.

ఈవీఎంలు పనిచేయడం లేదని పోలింగ్ ప్రారంభమైన తొలిగంట నుంచి తాము ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు చంద్రబాబు. భద్రతకు అవసరమైన బలగాలు పంపలేదనీ, మహిళలపై దాడులు జరుగుతున్నా స్పందించలేదన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఈవీఎంలు ఒకేసారి ఎందుకు ఫెయిలవుతాయని ప్రశ్నించారు. పోలింగ్ ఆలస్యమైతే… మర్నాడు ఎన్నికలు జరుపుతామని అధికారులు భరోసా ఇవ్వాలనీ, ఆ పని కూడా చెయ్యలేదన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసి అర్ధరాత్రి వరకూ ఓటింగ్ ప్రక్రియ జరపడమంటే.. ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ఎన్నిరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టినా, వారు భరించి ఓటు హక్కు వినియోగించుకున్నారనీ, అది వారి గొప్పతనమన్నారు.

బేలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగే విధానం మళ్లీ రావాలన్నారు. ఈవీఎంల పనితీరు మీద అందరిలోనూ అనుమానాలున్నాయనీ, దీన్ని కొందరు అపహాస్యం చేయడం సరికాదన్నారు. బ్యాలెట్ పేపర్లు లెక్కించేందుకు మహా అయితే 16 గంటలు సమయం పడుతుందనీ, అలాంటిది వీవీ ప్యాట్ల లెక్కింపునకు ఆరు రోజులు కావాలని ఎలా చెప్తారనీ, చివరికి ఈ విషయంలో సుప్రీం కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. 50 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించడానికి ఎందుకు భయపడుతున్నారన్నారు. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలని గట్టిగా డిమాండ్ చేస్తామన్నారు.

మరో రెండురోజులపాటు చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉంటారు. ఈవీఎంల పనితీరు, ఏపీలో ఎన్నికలు జరిగిన విధానంపై ఇతర జాతీయ పార్టీలతో కూడా ఆయన చర్చిస్తారు. లోక్ సభ ఎన్నికలు ఇంకా చాలా రాష్ట్రాల్లో జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో… ఒక పార్టీని అడ్డం పెట్టుకుని మోడీ అనుసరించిన కుట్ర వ్యూహాన్ని ఇతర జాతీయ పార్టీలు మంచి అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. అంతేకాదు, అధికారంలో ఉన్నవారు.. ఎన్నికల సమాయానికి వచ్చేసరికి రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ఈ విష సంస్క్రుతిపై కచ్చితంగా పోరాటం చేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరివీ..? ఎందుకీ అస్పష్టత..?

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే విషయంలో ఎవరూ స్పష్టతకు రాలేకపోతున్నారు.ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదట్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో...

ఎంపీ ఎన్నికలు…హైదరాబాద్ లో కర్ఫ్యూ..!!

హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే మహానగరం వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళడంతో నగరమంతా బోసిపోయింది. ఇది హైదరాబాదేనా అనుమానం వచ్చేలా హైదరాబాద్ నిర్మానుష్యంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close