తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు.

ఏపీ సీఎం జగన్ రెడ్డి దంపతులు పులివెందుల నియోజకవర్గంలోని భాకరాపురం పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు , ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఓటు వేశారు. మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తన తల్లి షాలిని, సతీమణి ప్రణతితో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓబుల్ రెడ్డి స్కూల్ లో వీరు ఓటు వేశారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జూబ్లిహిల్స్ లోని బీఎస్ఎన్ ఎల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు , సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి బర్కత్ పురాలో ఓటు వేశారు.మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జూబ్లిహిల్స్ లో ఓటు వేశారు.

ఏపీలో 25 ఎంపీ స్థానాలకు, 175అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతుండగా… తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close