టాలీవుడ్లో మేకర్‌గా దిల్‌రాజుకి మంచి పేరుంది. ఆయన బ్యానర్లో సినిమా అంటే బడా హీరోలంతా కాల్షీట్లు ఇవ్వడానికి రెడీ అయిపోతుంటారు. కాంబినేషన్లని సెట్ చేయడంలోనూ దిల్‌రాజు తరవాతే అన్నది అందరి నమ్మకం. కథ విషయంలో ఎంత పట్టుగా కూర్చుంటాడో, ఆ సినిమాకి కావల్సినంత ప్రమోషన్ కల్పించడంలోనూ అంతే ఇదిగా పనిచేస్తాడు కాబట్టి.. దిల్‌రాజు పేరు ఓ బ్రాండ్‌గా మారిపోయింది. శతమానం భవతి లాంటి చిన్న సినిమాని ఈ సంక్రాంతి బరిలో నిలిపి, రెండు పెద్ద సినిమాలతో పోటీ పడి.. దాదాపు రూ.25 కోట్లు తెచ్చుకొన్నాడంటే దిల్‌రాజు కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవొచ్చు. అలాంటి దిల్‌రాజుకి నాగార్జున గట్టి షాక్ ఇచ్చాడు.
ఈ సంక్రాంతికి తనకు హిట్ ఇచ్చిన సతీష్వేగ్నేశకు మరో ఆఫర్ ఇచ్చాడు దిల్‌రాజు. నాగార్జున – నాగచైతన్యల కోసం సతీష్ ఓ కథ సిద్దం చేశాడని, త్వరలోనే ఈ అక్కినేని మల్టీస్టారర్ రూపుదిద్దుకోనుందని ప్రకటించేశాడు దిల్‌రాజు. ఈ వార్తని అన్ని ప్రముఖ పత్రికలూ ప్రచురించాయి. సోషల్ మీడియాలో కూడా గట్టిగా హల్ చల్ చేసిందీ న్యూస్. అయితే.. ఈ న్యూస్‌పై నాగ్ పెదవి విరిచాడు. `అసలు మా ఇద్దరితో సినిమా అన్నది దిల్‌రాజు నా దృష్టికే తీసుకురాలేదు. ఇది నాక్కూడా ఓ పెద్ద షాకింగ్ న్యూస్‌లా ఉంది` అంటూ కొట్టిపడేశాడు నాగ్. అంటే.. నాగ్‌కి కథ వినిపించకుండానే, చైతూతో సంప్రదించకుండానే దిల్‌రాజు ఈ న్యూస్ బ్రేక్ చేసేశాడన్నమాట. `మా బ్యానర్లో సినిమా అంటే ఎగురుకొంటూ చేస్తారులే` అంటూ దిల్‌రాజు ఓవర్ కాన్ఫిడెన్స్‌కి వెళ్లిపోయి ఉంటాడు. అందుకే నాగ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఈగోల వరకూ వెళ్తుంటాయి. ఇప్పుడు సతీష్ ఓ గొప్పకథ చెప్పినా.. అందులో నటించడానికి అటు నాగ్, ఇటు చైతూ ఒప్పుకోకపోవొచ్చు. సో… దిల్‌రాజు మరో ఇద్దరు హీరోల్ని వెదుక్కోవాల్సిందే.