రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. నేటి యువత స్టార్టప్ లక్ష్యాలతో ఉన్నారు. వారికి అవసరమైన సపోర్టు ఇచ్చే లక్ష్యంతో ఈ ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్క రోజులోనే లక్షా అరవై వేల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారంటే.. యువత తమ ఆలోచనలు, ఆవిష్కరణల కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఒక కుటుంబం నుంచి ఒక స్టార్టప్ సృష్టికర్త లక్ష్యం
స్టార్టర్ అంటే.. యాప్‌లతో చేసేది కాదు. ప్రతి బిజినెస్ ఐడియా ఒక స్టార్టప్‌నే. దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారన్నదానిపై ఆ స్టార్టప్ సైజ్ ఆధారపడుతుంది. రాష్ట్రంలో యువతను ఈ దిశగా ప్రోత్సహించడంతో పాటు మార్గదర్శనం, నిధులు, సాంకేతిక సహాయం అందించే వీలుగా ఈ ఇన్నోవేషన్ హబ్‌లకు రూపకల్పన చేశారు. అమరావతిలోని మంగళగిరిలో మయూరి టెక్ పార్క్‌లో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటగా ఏర్పాటు చేశారు. డీప్ టెక్, ఏఐలను ఉపయోంగించుకుని ఈ సెంటర్ సిద్ధం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నోవేషన్ సెంటర్లు
మంగళగిరి ఇన్నోవేషన్ హబ్ తో పాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ , తిరుపతి, నంతపురంలో ఐదు జోనల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. స్థానిక స్టార్టప్‌లు , MSMEలకు ఈ సెంటర్లు సహాయం అందిస్తాయి. RTIHలకు ప్రైవేట్ సెక్టార్ నిధులు సమకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా ప్రభుత్వం కొద్దిగా సీడ్ క్యాపిటల్ ,గ్రాంట్లను అందిస్తుంది. ఇక్కడ యువత ఐడియాలను ఆయా కార్పొరేట్ సంస్థలు మెచ్చితే ఎంత పెట్టుబడి అయినా సులువుగా వచ్చేస్తుంది.
దిగ్గజ పారిశ్రామిక సంస్థల సపోర్టు
ప్రతి జోనల్ సెంటర్‌కు ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థ మెంటార్‌గా ఉంటోంది. టాటా గ్రూప్, ఎల్ అండ్ టీ, అదానీ, గ్రీన్కో, జిఎంఆర్, కియా వంటి సంస్థలు ప్రస్తుతం ఈ ఇన్నోవేషన్ సెంటర్ల విషయంలో కీలకంగా వ్యవరిస్తున్నా యి. వీటిల్లో ఔత్సాహికుల స్టార్టప్‌లకు నిధులు, ఇన్క్యుబేషన్, యాక్సిలరేషన్ కోసం ఆర్థిక మద్దతు లభిస్తుంది. ప్రభుత్వం ఎస్క్రో ఖాతా ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించడాన్ని పరిశీలిస్తోంది.
మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా మార్చడానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు , విద్యావేత్తలతో కలిసి పనిచేసే ఎకో సిస్టమ్‌ను రూపొందిస్తున్నారు. కలలు కనే యువత వాటిని సాకారం చేసుకునేందుకు ఈ ఇన్నోవేషన్ హబ్స్ అన్ని రకాలకుగా మద్దతుగా ఉంటాయి. ఇక వారికి ఆకాశమే హద్దు.