గెలవబోతున్నామన్న నమ్మకం కలిగించడానికి చంద్రబాబు తంటాలు..!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. టీడీపీ గెలుపుపై… పూర్తి నమ్మకంతో ఉన్నారు. నియోజకవర్గాల సమీక్షల్లో ఏ జిల్లాలో ఎన్ని సీట్లు రాబోతున్నాయో కూడా చెబుతున్నారు. తాను నాలుగు సర్వేలు చేయించానని.. అన్నింటినీ టీడీపీదే విజయమని చెబుతున్నారు. కానీ.. టీడీపీ నేతల్లో పూర్తి స్థాయి విశ్వాసం మాత్రం కలగడం లేదు. దానికి కారణం … చంద్రబాబే…!. చేసిందంతా చేసి ఇప్పుడు గెలవబోతున్నామంటే… నమ్మడానికి వారు రెడీగా లేరు.

టీడీపీ ఓడిపోతుందనే ప్రచారం ప్రారంభించింది చంద్రబాబే..!

పోలింగ్ రోజు… పోలింగ్ బూత్‌ల వద్ద మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి తరలి రావడంతో.. టీడీపీకి పరిస్థితి పాజిటివ్‌గా ఉందన్న ప్రచారం జరిగింది. మండుతున్న ఎండల్లో… ఈవీఎంలు మొరాయించినా… ఓటర్లు బారులు తీరారు. దేశంలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయింది. టీడీపీకి అండగా ఉంటారనుకున్న వర్గాలు ఎక్కువగా పోలింగ్ బూత్‌లలో కనిపించడంతో… టీడీపీకి అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా..టీడీపీ అధినేత… పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు నుంచే… ఈవీఎంల మొరాయింపు, వీవీ ప్యాట్ల లెక్కింపుపై.. పోరాటం ప్రారంభించారు. దీంతో… ఓడిపోతారన్న ఉద్దేశంతోనే… చంద్రబాబు.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారనే ప్రచారాన్ని విపక్ష పార్టీలు ఉద్ధృతం చేశాయి. జాతీయ రాజకీయాలను దృష్టి లో పెట్టుకుని చంద్రబాబు.. ఆ పోరాటం చేశారు. కానీ ఆ భావన కన్నా… ఓడిపోతారన్న అంచనాతో.. ఈవీఎంలపై నిందలేయడానికి ఇలా చేస్తున్నారన్న ప్రచారాన్ని మాత్రం వైసీపీ, బీజేపీ నేతలు ఉద్ధృతం చేశారు. అదే ప్రజల్లోకి వెళ్లిపోయింది.

అంతా అయ్యాక.. ఇప్పుడు నమ్మకం పెంచే ప్రయత్నం..!

చంద్రబాబు చేసిన సాయంతో.. టీడీపీ గెలవబోవడం లేదన్న ప్రచారాన్ని ఏపీలో వైసీపీ ఊపందుకునేలా చేసింది. దాంతో.. శ్రేణుల్ని ధైర్యం కలిగించడానికి చంద్రబాబు గెలవబోతున్నామని చెప్పడం ప్రారంభించారు. పోలింగ్ సరళిపై.. నాలుగు వేర్వేరు సంస్థలతో సర్వేలు చేయించానని అన్నింటిలోనూ గెలుపు ఖాయమని తేలిందని చెబుతున్నారు. టీడీపీ కోసం చేస్తున్నారని తెలియకుండానే.. ఆ సంస్థలతో సర్వేలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నాలుగు సర్వేలు..దాదాపుగా ఒకే రీతిన వచ్చాయని..టీడీపీ విజయం ఖాయమని తేలిందని… టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. అనూహ్యంగా..కర్నూలు జిల్లా నేతలతో జరిగిన రివ్యూ మీటింగ్ లో చంద్రబాబు కూడా… నాలుగు సర్వేల గురించి ప్రస్తావించారు. నాలుగు విభిన్న సర్వేలు చేయించామని.. అన్నింటిలోనూ టీడీపీ గెలుపు ఖాయమయిందని నమ్మకం వ్యక్తం చేశారు… కానీ టీడీపీ నేతల్లో మాత్రం.. కాన్ఫిడెన్స్ పెరగడం లేదు.

సాధారణ ప్రజానీకంలోనూ అదే చర్చ..!

పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు.. జాతీయ రాజకీయ దృష్టితో చేసిన రాజకీయం.. మొత్తానికే తేడాకొట్టేసింది. సాధారణ ప్రజల్లోనూ.. చంద్రబాబు ఓడిపోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు ఎపీలో ఒక్క టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్ప.. మిగతా వాళ్లంతా.. జగన్ గెలుస్తున్నాడటగా.. అన్న చర్చను ప్రారంభిస్తున్నారు. అయితే.. ఇందులోనూ టీడీపీ నేతలకు కొన్ని సానుకూల సంకేతాలున్నాయి. అదేమిటంటే… సామాన్యుల మధ్య జరుగుతున్న చర్చలో..జగన్ గెలుస్తాడని అనుకుంటున్న దానికి కారణంగా.. ఈవీఎంలు, బీజేపీ సహకరించడం.. ఈసీ చెప్పినట్లు చేస్తూండటంతో.. వంటి అంశాలున్నాయి. కానీ జనం ఓట్లేస్తే జగన్ గెలుస్తాడని ఎవరూ చర్చించుకోవడం లేదు. అదే నిజం అయితే.. అక్రమాలు జరగకపోతే… టీడీపీ గెలుస్తుందని.. అర్థం చేసుకోవచ్చని.. టీడీపీ నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close