ఖమ్మం బరిలో నామా వర్సెస్ తుమ్మల..! యుద్ధానికి పాత మిత్రలు సిద్ధం..!

తెలంగాణలో ఏ లోక్‌సభా నియోజకవర్గంపై లేనంత ఆసక్తి ఖమ్మం స్థానంపై ఉంది. అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను ప్రజాకూటమి అభ్యర్థులు గెలుచుకోవడమే కాదు.. దాదాపుగా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని.. ఏడు నియోజకవర్గాల్లో కలిపి లక్షన్నర ఓట్ల మెజార్టీ వరకూ సాధించారు. దాంతో.. తెలంగాణలో మిగతా చోట్ల సంగతేమో కానీ… ఖమ్మంలో మాత్రం .. ప్రజాకూటమి అభ్యర్థి గెలుస్తారని…ఓ అంచనాకు వచ్చారు. అందుకే కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలంతా.. ఖమ్మం టిక్కెట్ కోసం… రేసులో ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. సహజంగా..ఆ స్థానాన్ని టీడీపీకి వదిలి పెట్టాల్సి ఉంటుంది. కూటమిని కొనసాగించాలనేది.. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం కాబట్టి… టీడీపీకి ఇచ్చే ఒకటి, రెండు పార్లమెంట్ సీట్లలో.. ఖమ్మం సీటు ఖాయంగా ఉంటుంది.

తెలుగుదేశం పార్టీ ఖమ్మం సీటు ఖాయంగా తీసుకుంటుంది కాబట్టి.. అక్కడ నుంచి పోటీ చేయగలిగిన ఒకే ఒక్క నేత నామా నాగేశ్వరరావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నామా… మొదటి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ..అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో… ఖమ్మం బరిలో నిలబడాల్సి వచ్చింది. కానీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఫెయిలవడంతో… ఓడిపోయారు. ఆ ఒక్క సీటే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ గెలిచింది. అదే ఇప్పుడు.. నామా నాగేశ్వరరావుకు కలసి వస్తోంది. ఇప్పుడు ఆయన లోక్‌సభ ఎన్నికలకు తన క్యాడర్‌ను సమాయత్తం చేసుకుంటున్నారు. కొద్ది రోజులుగా.. కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. రేపోమాపో.. ఎన్నికల ప్రకటన రానున్న తరుణంలో..కసరత్తు ముమ్మరం చేశారు. అనూహ్యంగా.. టీఆర్ఎస్ తరపున తుమ్మల నాగేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడంతో.. మంత్రి పదవి మిస్సయింది. ఇప్పుడు ఖమ్మం బరిలో ఆయనను దింపాలని.. కేసీఆర్ దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమ్మం సీటును గెలవాలనే పట్టుదలతో ఉండటంతో… నామాకు ధీటైన ప్రత్యర్థి ఆయనే అవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

నిజానికి తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు ఇద్దరూ.. ఖమ్మం రాజకీయాల్లో టీడీపీకి పెద్ద దిక్కుల్లా వ్యవహరించారు. అయితే..ఇద్దరూ… తమ ఆధిపత్యం కోసం… రెండు వర్గాలను మెయిన్‌టెయిన్ చేయడంతోనే సమస్య వచ్చింది. ఒకరి వర్గాన్ని ఒకరు ఓడించుకోవడానికి ప్రతీ ఎన్నికల్లోనూ ప్రయత్నించడం కామన్ అయిపోయింది. 2014 ఎన్నికల్లో కూడా ఒకే పార్టీ తరపున పోటీ చేసిన ఇద్దరూ ఓడిపోయారు. ఆ తర్వాత తుమ్మల టీఆర్ఎస్ లో చేరి మంత్రయ్యారు. కానీ నామా టీడీపీలోనే ఉన్నారు. ప్రత్యర్థులుగా మారారు. ఇప్పుడు ముఖాముఖి తలపడబోతున్నారు. అందుకే ఖమ్మం సీటుపై.. అందరి దృష్టి పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close