అందుకు సిగ్గుపడుతున్నాను: నమస్తే తెలంగాణా సంపాదకుడు

నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంపై విద్యార్ధులు, తల్లితండ్రులు, ప్రజలు  అందరూ కూడా తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో దోషులను విడిచిపెట్టమని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన ముగ్గురు విద్యార్ధులను అరెస్ట్ చేసారు. కానీ వారు ముగ్గురు అధికారిక పార్టీకి చెందిన సామాజిక వర్గానికి చెందినవారే కనుక ప్రభుత్వంలో కొందరు పెద్దలు వారిని రక్షించేప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రిషితేశ్వరి ఆత్మహత్యపై సమగ్ర న్యాయవిచారణ జరిపించి బాధ్యులయిన విద్యార్దులని, విశ్వవిద్యాలయ అధికారులని కూడా కఠినంగా శిక్షించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

రిషితేశ్వరి ఆత్మహత్యపై ఉభయ రాష్ట్రాలలో మీడియా అనేక వార్తలు, కధనాలు ప్రచురించాయి. రిషితేశ్వరి ఆత్మహత్య గురించి వడ్లమూడి హర్ష అనే వ్యక్తి వ్రాసిన ఒక కధనాన్ని నమస్తే తెలంగాణా పత్రిక సంపాదకులు కట్ట శేఖర్ రెడ్డి తన ‘కట్టా మీటా’ బ్లాగులో పెట్టారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ముగ్గురూ అధికారిక పార్టీకి చెందిన సామాజిక వర్గానికి చెందినవారేనని అందులో రచయిత పేర్కొన్నారు. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా అటువంటి కధనాలు పోస్ట్ చేసారని చాల మంది తీవ్ర విమర్శలు చేయడంతో, కట్టా శేఖర్ రెడ్డి గుంటూరులోని తన జర్నలిస్టు మిత్రుల ద్వారా పోలీసులు అరెస్ట్ చేసిన విద్యార్దుల వివరాలు సేకరించారు. అందులో చాలా ఆశ్చర్యకరమయిన విషయాలు తెలిసాయి.

అరెస్టయిన వారిలో ఏ ఒక్కరూ కూడా అధికారిక పార్టీ సామాజిక వర్గానికి చెందినవారు లేరు. వారు వైశ్య, ఎస్టీ, కాపు సామాజిక వర్గాలకి చెందినవారు. వారిలో ఒకరు తెలంగాణాలో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్ధి అని తెలిసింది. మిగిలిన ఇద్దరిలో ఒకరు గుంటూరు, మరొకరు తూర్పు గోదావరి జిల్లా  చిల్లంగి పేటకి చెందిన విద్యార్ధులుగా పోలీస్ రికార్డులలో వారి వివరాలు నమోదయి ఉన్నాయి.

ఈ వాస్తవాలను తెలుసుకోకుండా వడ్లమూడి హర్ష వ్రాసిన కధనాన్ని తన బ్లాగులో పెట్టినందుకు కట్ట శేఖర్ రెడ్డి చాలా బాధపడ్డారు. ఒక పత్రికా సంపాదకుడనయిన తాను కూడా ఒక అసత్యాన్ని అనాలోచితంగా ప్రచారం చేసినందుకు సిగ్గు పడుతున్నానని, తక్షణమే ఆ కధనాన్ని తన బ్లాగులో నుండి తొలగిస్తున్నట్లు తెలియజేసారు. రిషితేశ్వరి ఆత్మహత్యకి కారకులయిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. జరిగిన పొరపాటును సమర్ధించుకోకుండా నిజాయితీగా తన తప్పును అంగీకరించి, చేసిన తప్పును సరిదిద్దుకొన్న కట్టా శేఖర్ రెడ్డిని అభినందించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close