నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి రఘురాం బదిలీ అయ్యారు. ఆయనకు కొత్త పోస్టింగ్ వచ్చింది . ఆయన స్థానంలో పట్టాభిరామారావును నియమించారు. జడ్జిల బదిలీలు కామనే కానీ సీబీఐ కోర్టు జడ్డి బదిలీ అంటే అందరికీ జగన్ కేసులే గుర్తుకు వస్తాయి. ఈ సారి జగన్ కేసులతో పాటు వివేకా హత్య కేసు కూడా ఆ కోర్టులోనే ఉంది. వాటిని విచారణ చేస్తున్న జడ్జి బదిలీ అయ్యారు. కొత్త న్యాయమూర్తి వస్తున్నారు.
జగన్ కేసులు ఏళ్లకేళ్లూ కోర్టులోనే మూలుగుతున్నాయి. దీనికి కారణం జగన్ తో పాటు సహ నిందితులు అదే పనిగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు అలా దాఖలు చేస్తూ రావడంతో విచారణ అంతా ఆ పిటిషన్లకే సరిపోతుంది. నిర్ణయం రావడం లేదు. డిశ్చార్జ్ పిటిషన్లను పరిష్కరిస్తే తర్వాత అసలు కేసుల ట్రయల్ ప్రారంభమవుతుంది. కానీ ఈ పిటిషన్లే పరిష్కారం కావడం లేదు.
ఓ సారి న్యాయమూర్తి విచారణ పూర్తి చేశారు. ఫలానా రోజు తీర్పు వెలువరిస్తారని అనుకుంటున్న సమయంలో ఒక రోజు ముందుగా ఆయన బదిలీ అయ్యారు. సాధారణంగా కోర్టుల్లో న్యాయమూర్తులు బదిలీ అయితే పాత కేసుల్లో విచారణ పూర్తయినా మళ్లీ కొత్తగా విచారణ చేస్తారు. అందుకే ఈ కేసులనూ మళ్లీ కొత్తగా విచారణ చేయాల్సి ఉంటుంది. కొత్త న్యాయమూర్తి అయినా వేగంగా పూర్తి చేస్తారని సోషల్ మీడియాలో కొంత మంది ఆశపడుతూ పోస్టులు పెడుతున్నారు