ఫ్లాప్ ఇచ్చినా… మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడు

బాల‌కృష్ణ ఆలోచ‌నా ధోర‌ణి అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం. ద‌ర్శ‌కుల్ని. క‌థానాయిక‌ల్ని ఆయ‌న ఎంపిక చేసే ప‌ద్ధ‌తిని ఎవ‌రూ.. జ‌డ్జ్ చేయ‌లేరు. ప్రాజెక్టులు సెట్ చేసుకోవ‌డంలోనే ఊహించ‌ని ట్విస్టులుంటాయి. ఫ్లాప్ ద‌ర్శ‌కులంద‌రినీ బాల‌య్య పిలిచి మ‌రీ అవ‌కాశాలు ఇస్తుంటాడు. త‌న‌తో ఫ్లాప్ తీసినా.. త‌న‌కు ప‌ట్టింపు ఉండ‌దు. అదే మ‌రోసారి రిపీట్ అవుతోంది.

ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేస్తున్నాడు బాల‌కృష్ణ‌. ఆ త‌ర‌వాత‌.. బి.గోపాల్ తో ఓ ప్రాజెక్టు సెట్ అయ్యింది. ప్ర‌స్తుతం బి.గోపాల్ బాల‌య్య కోసం క‌థ రెడీ చేసుకునే ప‌నిలో ఉన్నారు. ఇప్పుడు శ్రీ‌వాస్ కీ బాల‌య్య ఛాన్స్ ఇచ్చేశాడు. శ్రీ‌వాస్ ఇది వ‌ర‌కు బాల‌య్య‌ను `డిక్టేట‌ర్‌`గా చూపించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర తుస్సుంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో భారీగా ఖ‌ర్చు పెట్టిన తీసిన‌ `సాక్ష్యం` కూడా ఫ్లాపే. అయినా స‌రే, బాల‌య్య ఛాన్సిచ్చాడ‌ట‌. కోన వెంక‌ట్ ఈ క‌థ‌ని అందించార‌ని, అది… బాల‌య్య‌కు న‌చ్చింద‌ని, అందుకే ఈ సినిమా ఫైన‌ల్ చేశార‌ని టాక్‌. సో.. బి.గోపాల్ సినిమా అవ్వ‌గానే, శ్రీ‌వాస్ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ అధ్యక్షుడిగా రఘురామ .. పోటీ చేస్తారట !

వైసీపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ అధినేత రఘురామకృష్ణరాజు ... సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆయన కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారట. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన...

” మంచు టీం ” నీతులు చెప్పడానికే.. పాటించడానికి కాదు !

"మా" ఎన్నికల గురించి మీడియా ముందుకు ఎవరూ వెళ్లవద్దని మోహన్ బాబు మైక్ దొరికిన ప్రతీ సారి చెబుతున్నారు. కానీ ఆయన పుత్రుడు జట్టు మాత్రం ఎక్కడ మైక్ దొరికితే అక్కడ మాట్లాడుతోంది....

‘చిరంజీవి చారిటబుల్ ట్ర‌స్ట్’ వెబ్ సైట్‌ను ప్రారంభించిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌

మెగాస్టార్ చిరంజీవి.. చిరంజీవి చారిటబుల్ ట్ర‌స్ట్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసి అభిమానుల‌ను సేవా గుణం వైపు న‌డిపిస్తూ ర‌క్త దానం, నేత్ర‌దానం వంటి కార్య‌క్ర‌మాల్లో వారిని భాగ‌స్వామ్యులుగా చేశారు. ఎన్నో సేవా...

పవన్ కళ్యాణ్ తో చాలా మాట్లాడాను: విష్ణు

గ‌వ‌ర్నర్ ద‌త్తాత్రేయ నేతృత్వంలో జ‌రిగిన ఆలయ్ బలయ్ కార్యక్రమంలో ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, ప్రజాసంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. ఆజగా ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన హీరో మంచు విష్ణు, జ‌న‌సేన అధినేత పవర్ స్టార్...

HOT NEWS

[X] Close
[X] Close