వంగవీటి రాధాను ప్లాన్డ్‌గా బలహీనుడ్ని చేస్తున్న ఫ్రెండ్స్ నాని, వంశీ !

వంగవీటి రాధాకృష్ణ.. తన తండ్రి వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఇంతకీ వంగవీటి రాధను చంపేందుకు ఎవరు రెక్కీ నిర్వహిస్తారు ? ఇప్పుడు ఆయన రాజకీయాల్లోనూ అంత యాక్టివ్‌గా లేరు. ముఠా తగాదాలు కూడా విజయవాడలో దాదాపుగా లేవు. ఇలాంటి సమయంలో ఆయన ఈ స్టేట్‌మెంట్ ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ.. ఆయన వెంటనే వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా వైసీపీ నేతలు.. మిత్రులు అయిన వల్లభనేని వంశీ, కొడాలి నాని పక్కనే ఉన్నారు.

వంగవీటి రాధాకృష్ణకు అటు కొడాలి నానితో పాటు ఇటు వల్లభనేని వంశీ కూడా మిత్రులే. అయితే వంగవీటి ముందు నుంచి వైసీపీలో ఉన్నారు. ఆయన తర్వాత ఘోర అవమానం జరగడంతో బయటకు వచ్చేశారు. అయితే స్నేహం మాత్రం కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కొనసాగుతోందని చెబుతున్నారు. గత రెండేళ్లలో అంతర్గతంగా ఎన్ని సార్లు కలిశారో ఎవరికీ స్పష్టత లేదు కానీ.. బహిరంగంగా మాత్రం ఇటీవలే కలుస్తున్నారు. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా ఇద్దరు మిత్రులతో కలిసి కార్యకలాపాలు నిర్వహించారు.

వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉన్నారు. రాజధాని ఉద్యమానికి తనదైన మద్దతు ఇచ్చారు. అయితే టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్‌గా లేరు. ఆయనను మళ్లీ వైసీపీలోకి తీసుకెళ్లందుకు మిత్రులు ప్రయత్నిస్తున్నారని.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పటికి ఇద్దరు మిత్రులు కలిసి ఆయనను మోటివేట్ చేయడమే కాకుండా… టీడీపీలో ఆయనపై అనుమాన మేఘాలు కమ్మేలా పక్కా వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు.. రాధాకృష్ణ అనుచరుల్లో వ్యక్తమవుతున్నాయి. కొసమెరుపేమిటంటే.. రంగా ఆశయాల సాధన కోసం పని చేస్తామని వల్లభనేని వంశీ ప్రకటించుకోవడం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close