“ఇష్మార్ట్ జోడి” సీజన్ 2 స్టార్ మా లో…!

ప్రేక్షకులకు కనువిందు చేయడానికి, వినోదంలో విహరింపచేయడానికి స్టార్ మా “ఇష్మార్ట్ జోడి” సీజన్ 2. ఓంకార్ ప్రెజెంటర్ గా ఆయన దర్శకత్వంలో ఇష్మార్ట్ జోడి సీజన్ 1 పెద్ద విజయం సాధించింది. మరిన్ని అదనపు ఆకర్షణలతో ఇప్పుడు రెండో సీజన్ ప్రారంభించడానికి సర్వం సిద్ధం అయింది.

మనకి వివిధ సీరియల్స్ లో, రకరకాల కార్యక్రమాల్లో కనిపించే సెలెబ్రిటీలు ఈ షో లో సందడి చేయబోతున్నారు. రకరకాల రౌండ్స్ లో ఈ జంటలు ఈ సీజన్ లో మనల్ని అలరించబోతున్నారు. ప్రీతీ నిగమ్ – నగేష్, బాబా భాస్కర్ – రేవతి, కౌశల్ – నీలిమ, అమ్మ రాజశేఖర్ – రాధ, అవినాష్ – అనుజా, శివారెడ్డి – స్వాతి రెడ్డి, కౌశిక్ – భవ్య, మహేశ్వరీ-శివనాగ్, ఏకనాథ్ -హారిక, లహరి – ధీరేన్, హర్షిత – వినయ్, విశ్వ – శ్రద్ధ… ఈ సీజన్ లో వినోదాన్ని అందిస్తూ “ఇష్మార్ట్ జోడి” టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు.

స్టార్ మా తో ఎంతో అనుబంధం వున్న దర్శకుడు ఓంకార్ ఈ సారి ఈ షో నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా తీర్చిదిద్దబోతున్నారు. ఈ షో ఈ 26 నుంచి మొదలవుతుందని స్టార్ మా లో చూసాను. సాయంత్రం 6 గంటలకి గ్రాండ్ లాంచ్ ప్రసారం అవుతుంది.

ప్రతి వారం శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అవుతుంది. తప్పక చూడండి.. ఇష్మార్ట్ జోడి సీజన్ 2. మీ అభిమాన స్టార్ మా లో.

“ఇష్మార్ట్ జోడీ 2” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/wl2FbWWlByw

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close