ఫ‌స్టాఫ్ వినోదం + సెకండాఫ్ క‌థ‌

నాని సినిమా అంటే వినోదం ఉండాల్సిందే. క‌థ అటూ ఇటూ తిరిగినా – ఎంటర్‌టైన్‌మెంట్ విష‌యంలో మాత్రం లోటు జ‌ర‌క్కూడ‌దు. కేవ‌లం వినోదాన్ని న‌మ్ముకుని గ‌ట్టెక్కిన సినిమాలు నాని ఖాతాలోనూ క‌నిపిస్తాయి. నేను లోక‌ల్‌, ఎంసీఏ అలాంటి క‌థ‌లే. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధంలోనూ వినోదానికి ఢోకా లేకుడా చూస్తుకున్నాడట‌. అదే.. ఈసినిమాని నిల‌బెట్టేస్తుంద‌ని నాని ధీమాగా ఉన్నాడు. వ‌రుస హిట్ల‌మీద ఉన్న నాని నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. నాని ఊపుమీద ఉండ‌డంతో పాటు, ఈ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా దిల్ రాజు విడుద‌ల చేస్తుండ‌డంతో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. నానికెరీర్‌లో తొలిసారి యూఎస్‌లో 600 స్క్రీన్స్‌లలో ప్రీమియ‌ర్ ప‌డ‌బోతోంది. ”ఈ సినిమా చూశా. చాలా న‌మ్మ‌కంగా ఉన్నాను. ఇది వ‌ర‌క‌టి సినిమాల‌కంటే ఉన్న‌తంగా ఉంటుంది. ప్ర‌తీ సినిమా విడుద‌ల‌కు ముందు నాకు కొంచెం టెన్ష‌న్‌గా ఉంటుంది. ఆ ఒత్తిడి ఉండ‌కూడ‌ద‌నే ఎక్కువ సినిమాలు చేస్తుంటా. అయినా స‌రే… ఒత్తిడి వ‌ద‌ల‌డం లేదు“ అంటున్నాడు నాని. ఈ సినిమాపై దిల్‌రాజు కూడా పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాడు.”తొలి భాగం అంతా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంది. నాని నుంచి ఆశించే వినోదం ఉంటుంది. ద్వితీయార్థంలో అస‌లైన క‌థ మొద‌ల‌వుతుంది” అంటూ ప్రేక్ష‌కుల్ని ముందే ప్రిపేర్ చేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close