స్నేహం – ప్రేమ – ప‌గ‌… ద‌స‌రా!

ద‌స‌రా ఫీవ‌ర్ మొద‌లైంది. వ‌చ్చే వార‌మే నాని సినిమా విడుద‌ల‌. నాని కెరీర్‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. పైగా తొలి పాన్ ఇండియా చిత్రం. నాని గెట‌ప్.. సెట‌ప్ అంతా కొత్త‌గా ఉన్నాయి. విజువ‌ల్స్ ఓ రేంజ్‌లో క‌నిపిస్తున్నాయి. బిజినెస్ ప‌రంగా, క్రేజ్ ప‌రంగా… ద‌స‌రా దూసుకుపోతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిట‌న్న‌ది చిత్ర‌బృందం ఇంకా చెప్ప‌లేదు. కాక‌పోతే.. నాని ధ‌ర‌ణి అనే పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని, త‌నో బొగ్గుల దొంగ అని రివీల్‌చేసింది.

ఈ సినిమా కోర్ పాయింట్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. స్నేహం, ప్రేమ‌, ప‌గ‌.. ఈ మూడింటి మ‌ధ్య `ద‌స‌రా` సాగ‌బోతోంది. స్నేహితుడి మ‌ర‌ణానికి హీరో తీసుకొనే రివైంజ్ ఈ సినిమా. ఇందులోని ప్రేమ క‌థ‌లోనూ పెయిన్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఓ ర‌కంగా.. ఇది ఓ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీలా సాగ‌బోతోంద‌ని, ఆ ప్రేమ‌క‌థ‌లో వ‌చ్చే ట్విస్టు కొత్త‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. చూడ్డానికి `ద‌స‌రా` చాలా `రా` అండ్ ర‌స్టిక్‌గా క‌నిపిస్తున్నా, ఎమోష‌న‌ల్ సీన్లు బాగా పండాయ‌ని స‌మాచారం. యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు పెద్ద పీట వేశార‌ని, విల‌న్ పాత్ర కూడా బాగా తీర్చిదిద్దార‌ని తెలుస్తోంది. మొత్తానికి… ద‌స‌రా స్నేహం, ప్రేమ‌, ప‌గ‌ల‌కు పెద్ద పీట వేసిన సినిమా అని తేలింది. మ‌రి ఈ కాంబో ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి తెలంగాణ టెన్షన్ – ఈటల మళ్లీ ఢిల్లీకి !

తెలంగాణలో నేతల మధ్య ఎలా సమన్వయం సాధించాలో బీజేపీ పెద్దలకు అర్థం కావడం లేదు. బండి సంజయ్ ను మార్చాల్సిందేనని పార్టీలో చేరిన నేతంలతా కోరుతున్నారు. ఇలాంటి సమయంలో కరెక్ట్ కాదని హైకమాండ్...

మాగుంట బెయిల్ రద్దు – అవినాష్‌కి…

వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలకు బెయిల్ టెన్షన్ పట్టి పీడిస్తోంది. ఓ ఎంపీ తన కుమారుడు బెయిల్ రద్దు అయిపోతుందేమోనని కంగారు పడిపోయారు. ఆయన భయానికి తగ్గట్లుగానే బెయిల్ రద్దు అయింది. ఢిల్లీ...

రివ్యూ: టక్కర్

Takkar Movie Review తెలుగు360 రేటింగ్ : 2/5 సిద్ధార్థ్ ప్రతిభ గల నటుడు. ఆయనకి విజయాలు కూడా వచ్చాయి.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగులో చాలా క్రేజీ ని తెచ్చుకున్నాడు. ఐతే విజయాలని కొనసాగించడంలో...

మీడియా వాచ్ : బ్యాన్ చేసి ఏబీఎన్‌ క్రేజ్ పెంచేసిన జగన్ !

ఏబీఎన్ చానల్ కు జగన్ ఎంత మేలు చేశారంటే.. ఇప్పుడా చానల్ యూ ట్యూబ్ లో జాతీయ.స్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఆ చానల్ రాకుండా చేశారు. డిష్‌లలో వస్తుంది. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close