ప‌వ‌న్ టైటిల్ ఇదేనా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌కుడు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వినోదాయ సీత‌మ్‌`కి ఇది రీమేక్‌. జులై 28న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది ఇంకా తెలీలేదు. ఈ శ్రీ‌రామ‌న‌వ‌మికి టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ చిత్రానికి `దేవ‌ర‌` అనే టైటిల్ ఫిక్స్ చేసే అవ‌కాశం ఉంది. `గోపాల‌.. గోపాల‌` త‌ర‌హా క‌థ ఇది. అందులో ప‌వ‌న్ దేవుడిగా క‌నిపించాడు. ఇందులోనూ ప‌వ‌న్‌ది అలాంటి పాత్రే. సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ప‌వ‌న్‌ని `దేవ‌ర‌..` అని ముద్దుగా పిలుచుకొంటాడ‌ట‌. అందుకే ఈ సినిమా టైటిల్ గా ఈ పేరే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అయితే ఈ టైటిల్ మ‌రో నిర్మాత ద‌గ్గ‌ర ఉంద‌ని తెలుస్తోంది. పవ‌న్ సినిమా కోసం టైటిల్ ఒక‌టి అనుకొంటే, అది ఎవ‌రి ద‌గ్గ‌ర ఉన్నా.. ఈజీగా వ‌చ్చేస్తోంది. అందుకే టైటిల్ విష‌యంలో ఇదేం పెద్ద స‌మ‌స్య కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close