ఈ మార్పేమిటో ..జగన్ స్పీచ్‌లో తగ్గిపోయిన చంద్రబాబు, పవన్ జపం !

ఏపీ సీఎం జగన్ పథకానికి డబ్బులు రిలీజ్ చేయాలంటే బటన్లు నొక్కడానికి ఓ బహిరంగసభ పెడుతున్నారు. ఆ బహిరంగసభలో ఆయన చేసేదంతా రాజకీయ ప్రసంగమే. అది విద్యార్థులను ఉద్దేశించి చేసిన కార్యక్రమమైనా సరే నా వెంట్రక పీకలేరు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే తొలి సారిగా దెందులూరులో నిర్వహించిన ఆసరా పథకం బటన్ నొక్కుడు కార్యక్రమంలో మాత్రం ఇది రాజకీయ సభ కాదన్నట్లుగా కాస్త పద్దతిగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. జగన్ స్పీచ్ విని పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు.

పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నామని వాటిని మీరు ఎలా ఖర్చు పెట్టుకుంటారనేది తాను అడగనన్నారు. మహిళలకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వ శాయశక్తుల కృషి చేస్తుందన్నారు సీఎం జగన్. ఆసరా, చేయూత, జీరో వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచామన్నారు. గత పాలకుల కంటే మెరుగైన విధానాలు తీసుకొచ్చి దేశానికే పొదుపు సంఘాల మహిళలు ఆదర్సంగా నిలబెట్టామని తెలిపారు. పొదుపు సంఘాల పురోభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన విధానాలను ఇతర రాష్ట్రాలు వచ్చి పరిశీలిస్తున్నాయని తెలిపారు జగన్. ఎప్పటికప్పుడు బ్యాంకులతో మాట్లాడి వడ్డీ భారం మహిళలపై పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నామన్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా 78.94 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వివరించారు. 10 రోజుల పాటు ఏపీలో ఆసరా పంపిణీ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. అక్క చెల్లెమ్మలంతా అండగా ఉండాలని కోరారు.

స్పీచ్ మొత్తం మీద గత ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ఇవ్వలేదని.. డ్వాక్రా మహిళలు రుణాల ఊబిలో ఇరుక్కున్నారని అన్నారు కానీ.. రాజకీయంగా ఇతర ఆరోపమలు చేయలేదు. మామూలుగా అయితే ఆయన మీ బిడ్డనంటూ సెంటిమెంట్ ఒలకబోస్తారు. దుష్ట చదుష్టయం అని మీడియా నేతల మీద విరుచుకుపడతారు. తాను సంగిల్ సింహాన్నని చెప్పుకుంటారు. ఒంటరిగా వచ్చే దమ్ముంతా అనే సవాల్ కూడా చేస్తారు. రాజకీయ విమర్శలతో ప్రసంగం చేసేవారు. కానీ అనూహ్యంగాఆయన తీరు మారిపోవడంతో వైసీపీ నేతలు… తమ బాస్ కు గట్టి షాక్ తగిలినట్లుందే అనుకోవడం ప్రారంభించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు… తన మాటను కాదని ఎమ్మెల్యేలు జారిపోవడం.. ఎమ్మెల్సీగా మరో అభ్యర్థిని పెట్టినా గెలిచేవారని చంద్రబాబు వ్యాఖ్యానించిన అంశం జగన్ కు ఇబ్బందికరంగా మారిదందని అంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు తమ పట్ల పార్టీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు. ఈ సమయంలో జగన్ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయినట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close