తెలుగు హీరోలందరిలోకి నానీ ఒక్కడికి మాత్రమే ఓ స్పెషల్ స్ట్రెంగ్త్ ఉంది. అత్యంత సహజంగా..మనం రోజూ చూసే ఓ మామూలు తెలుగు కుర్రాడిలా తెరపైన కనిపించగల ప్రతిభ నానీ సొంతం. నానీ లుక్స్ కూడా దానికి చాలా హెల్ప్ అవుతాయి. అలా నానీ సహజంగా కనిపించిన సినిమాలన్నీ సూపర్ హిట్సే. అష్టాచెమ్మా, పిల్ల జమీందార్, భలే భలే మగాడివోయ్ సినిమాలు అందుకు సాక్ష్యం. ఉయ్యాల జంపాల సినిమా సూపర్ సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది అందులో కనిపించిన సహజత్వమే. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ సహజత్వమే సినిమాను కాపాడింది. తెలుగు ప్రేక్షకులందరూ కూడా తమ ఇంటి కథగా, తమకు తెలిసిన అమ్మాయి, అబ్బాయి ప్రేమకథను చూస్తున్నామని ఫీల్ అయ్యారు. అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
మొదటి సినిమాలోనే సహజత్వాన్ని అద్భుతంగా తెరపైకి తీసుకురాగలిగిన విరించి వర్మ, సహజ నటుడు నానీతో కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? మజ్ను ట్రైలర్‌లా ఉంటుంది. ఇది జస్ట్ శాంపిలే అయినప్పటికీ సినిమాపైన హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ని చాలా చాలా పెంచేసింది. ఎక్కడా నాటకీయత లేకుండా చాలా సహజంగా ఉండే మాటలే వినిపించాయి. రెగ్యులర్‌గా మనం మాట్లాడుకునే మాటలనే తెరపైన అందంగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. పాండిత్యం లేదు. అలాగే పంచ్‌లు, ప్రాసల కోసం పాకులాట కూడా లేదు. అన్ని డైలాగులు కూడా వినగానే గుర్తుండిపోయేలా ఉన్నాయి. అది చాలా చాలా బాగుంది. అలాగే ఆర్టిస్ట్స్ అందరి నుంచీ కూడా నేచురల్ యాక్టింగ్‌ని రాబట్టుకోవడంలో డైరెక్టర్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. యాజ్ యూజువల్….నేచురల్ స్టార్ నానీ…మరోసారి మేజిక్ చేశాడు. అన్ని ఎమోషన్స్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. అన్ని డైలాగులకూ తనదైన డైలాగ్ డెలివరీ స్కిల్స్‌తో ఇంకొంచెం బ్యూటీని తీసుకొచ్చాడు. డైరెక్షన్ కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకె. రాజమౌళి గెస్ట్ రోల్‌కి సంబంధించిన టచ్‌ని కూడా ట్రైలర్లోనే చూపించడం బాగుంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య…అతని జీవితంలోకి వచ్చే ఇదరమ్మాయిల మజ్ను సినిమా ఎలా ఉండబోతుందో చూడాలిమరి. ట్రైలర్ వరకూ అయితే మాత్రం బాగుంది.