నాని సినిమాకి ‘బ‌డ్జెట్‌’ స‌మ‌స్య‌

నాని సినిమాల‌కున్న గొప్ప ల‌క్ష‌ణం ఏమిటంటే.. త‌న మార్కెట్ ప‌రిధిని దాటి ఎప్పుడూ ఖ‌ర్చు చేయ‌నివ్వ‌డు. అందుకు సినిమా కాస్త అటూ ఇటూ అయినా నిర్మాత టేబుల్ ప్రాఫిట్‌తో బ‌య‌ట‌ప‌డిపోతాడు. బ‌డ్జెట్ దాటుతోందంటే.. నానినే స్వ‌యంగా క‌త్తిరింపుల‌కు దిగుతాడు. అందుకే నానితో సినిమా తీసిన ఏ నిర్మాతా న‌ష్ట‌పోలేదు. అయితే తొలిసారి నాని సినిమా బ‌డ్జెట్ ప‌రిధి దాటుతోంద‌ని స‌మాచారం.

నాని క‌థానాయ‌కుడిగా – రాహుల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. శ్యామ్ సింఘ‌రాయ్ సినిమా తెర‌కెక్కుతోంది. కొల‌కొత్తా నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. సినిమా ఎట్టిప‌రిస్థితుల్లోనూ అక్క‌డే తీయాలి. దానికి తోడు బ‌డ్జెట్ ప‌రిధి దాటుతోంద‌ని టాక్‌. ఈ సినిమాకి దాదాపుగా 40 కోట్లు కావాల‌ట‌. ఎంత త‌గ్గించాల‌న్నా కుద‌ర‌డం లేద‌ని తెలుస్తోంది. ఇప్పుడు బ‌డ్జెట్‌ని త‌గ్గించ‌డానికి క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. కొల‌కొత్తాలో షూటింగుల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోతే ప‌రిస్థితి ఏమిట‌న్న విష‌యాన్నీ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. ట‌క్ జ‌గ‌దీష్ త‌ర‌వాత ఈ సినిమానే ప‌ట్టాలెక్కాలి. అయితే సుకుమార్ శిష్యుడు శ్రీ‌కాంత్ నాని కోసం ఓ క‌థ రెడీ చేశాడు. ప‌రిస్థితి చూస్తుంటే `శ్యామ్ సింఘ‌రాయ్‌` కంటే శ్రీ‌కాంత్ సినిమానే ముందుగా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దర్యాప్తుపై స్టే సరికాదు..చట్టం తన పని తాను చేసుకోనివ్వాలి : సుప్రీంకోర్టు

చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఇవ్వాలని.. దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక సార్లు చెబుతూ వస్తున్నామని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన ఓ...

చీరలతో మహిళల మనసు గెలిచేలా కేటీఆర్ ప్లాన్..!

ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ సందడి కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ సారి చీరను సిద్ధం చేయించారు. పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు కూడా. గతంలో చీరల పంపిణీ...

తొలి అడుగు వ‌ర్మ‌దే!

అక్టోబ‌రు 15 నుంచి థియేట‌ర్లు తెర‌చుకుంటున్నాయి. అయినా నిర్మాత‌ల‌లో ఉత్సాహం లేదు. ఎప్ప‌టిలా థియేట‌ర్లకు జ‌నం వ‌స్తారా, రారా? అనే భ‌యాలు వెంటాడుతున్నాయి. అక్టోబ‌రు 15న థియేట‌ర్లు తెర‌చుకున్నా, కొత్త సినిమాలేవీ రావ‌ని...

‘పుష్ష’‌.. ఫైట్ రిహార్స‌ల్‌

టాలీవుడ్ లో షూటింగుల క‌ళ మొద‌లైంది. ఈనెల‌లోనే ఆచార్య‌, ఆర్‌.ఆర్‌.ఆర్ సెట్స్‌పైకి వెళ్ల‌బోతున్నాయి. వ‌చ్చే నెల‌లో `పుష్ష‌` కూడా షూటింగ్‌కి శ్రీ‌కారం చుట్టుకుంటోంది. అయితే అందుకు సంబంధించిన స‌న్నాహాలు మాత్రం ఇప్పుడే మొద‌లైపోయాయి....

HOT NEWS

[X] Close
[X] Close