వెంకీ వాకిట్లో… మ‌ల్టీస్టార‌ర్ల చెట్టు!

మ‌ల్టీస్టార‌ర్ అన‌గానే.. ఇది వ‌ర‌కు హీరోలు భ‌య‌ప‌డిపోయేవారు.
క‌థ కుద‌ర‌దండీ..
ఇమేజ్‌లు అడ్డొస్తాయి..
బ‌డ్జెట్లు స‌రిపోవు…
– ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్పేవారు. క‌థ‌లు ఉన్నా, వాటిని చేయ‌డానికి హీరోలు ధైర్యం చూపించేవారు. ఈగో గోడ‌లు అడ్డొచ్చేవి. అయితే వాట‌న్నింటినీ ప‌టాపంచ‌లు చేసిన‌వాడు విక్ట‌రీ వెంక‌టేష్‌.

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాతో కొత్త సంప్ర‌దాయం మొద‌లైంది. హీరోలిద్ద‌రూ తెర పంచుకొనే ధైర్యం వ‌చ్చింది. ఆ త‌ర‌వాత మ‌ల్టీస్టార‌ర్లు విరివిగా రావ‌డం మొద‌లెట్టాయి. చాలా వాటిలో… వెంకీనే హీరో. ఇప్పుడు కూడా మ‌ల్టీస్టార‌ర్ అంటే వెంక‌టేష్ గుర్తొస్తాడు. అంత‌లా ప్ర‌భావం చూపించాడు వెంకీ. మ‌సాలా, గోపాల గోపాల‌, వెంకీ మామా, ఎఫ్ 3… ఇలా మ‌ల్టీస్టార‌ర్‌కి కేరాఫ్ అడ్ర‌స్ అయ్యాడు. ఇప్పుడు కూడా వెంకీ చేతిలో మూడు మల్టీస్టార‌ర్ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఎఫ్ 2కి సీక్వెల్‌గా ఎఫ్ 3 క‌థ‌ని సిద్ధం చేశాడు అనిల్ రావిపూడి. వెంకీ లేకుండా ఎఫ్ 3 ఎలా ఉంటుంది? సో.. మ‌రోసారి వెంకీ, వ‌రుణ్‌లు కోబ్రా సెంటిమెంట్ కొన‌సాగించ‌బోతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడు రెండు క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ల గురించి విస్త్రృతంగా ప్ర‌చారం సాగుతోంది. వెంకీ – నాని క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడ‌ని కూడా అంటున్నారు. మ‌రోవైపు వెంకీ – సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి ఓసినిమా చేస్తార‌ని వార్త గ‌ట్టిగా వినిపిస్తోంది. త్రినాథ‌రావు న‌క్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలున్నాయి. అలా… ఈ సీజ‌న్ లో ప్ర‌చారంలో ఉన్న మూడు మ‌ల్టీస్టారర్ల‌లోనూ వెంకీనే హీరో. అలా మొత్తానికి తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ కాన్సెప్ట్‌కి పెద్ద దిక్క‌యిపోయాడు వెంకీ. మ‌రి ఆయ‌న ఖాతాలో ఇంకెన్ని మ‌ల్టీస్టార‌ర్లు వ‌చ్చి చేర‌తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close