నాని మాట నెగ్గ‌లేదా?

`వి` ని ఓటీటీల‌కు ఇస్తున్న‌ప్పుడు దిల్ రాజుపై నాని చాలా ఫైట్ చేశాడు. `ఇది థియేట‌ర్లో చూడాల్సిన సినిమా… ఓటీటీకి ఇవ్వొద్దు` అని వెనక్కి లాగాల‌ని చూశాడు. కానీ అప్ప‌ట్లో ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. `వి` ఓటీటీలో రావ‌డం వ‌ల్లే – దానికి రావ‌ల్సిన పేరు రాలేద‌న్న‌ది నాని భావ‌న‌. ఇప్పుడు `ట‌క్ జ‌గ‌దీష్‌` విష‌యంలోనూ నాని అలానే అడ్డుకోవాల‌ని చూశాడు. ఈ సినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌డం నానికి ఏమాత్రం ఇష్టం లేదు. `వి` ఓ థ్రిల్ల‌ర్‌. ఓటీటీ లో థ్రిల్ల‌ర్ల‌కి మంచి ప్లేస్ ఉంటుంది. `ట‌క్ జ‌గ‌దీష్‌` అలా కాదు. అదో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. క‌చ్చితంగా థియేరిటిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ వేరుగా ఉంటుంది. అందుకే నాని మ‌రింత ప‌ట్టుబ‌ట్టాడు. కానీ.. ఈసారీ కూడా నాని మాట నెగ్గ‌లేదు. ఈ సినిమా ఓటీటీకే వెళ్లిపోయింది.

అయితే ఈ సినిమాని ఇంకొన్ని రోజులు హోల్డ్ చేయ‌డానికి నాని చేయాల్సిందంతా చేశాడ‌ట‌. కానీ ఓటీటీకి విడుద‌ల చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. పెరుగుతున్న వ‌డ్డీ రేట్ల‌ని దృష్టిలో ఉంచుకుని, నిర్మాత‌ల‌కే నాని ఛాయిస్ వ‌దిలేయాల్సివ‌చ్చింద‌ని, ఇంకొన్నాళ్లు ఈ సినిమాని ఆపితే, నిర్మాత‌లు భారీగా న‌ష్ట‌పోతార‌న్న భ‌యంతోనే నాని ఈసారి కూడా వెన‌క‌డుగు వేశాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి నాని నుంచి వ‌రుస‌గా రెండు సినిమాలు ఓటీటీకి వెళ్లిపోయాయి. ఈసారైనా నాని ఎదురు చూసిన ఫ‌లితం వ‌స్తుందో రాదో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close