లావణ్యను హిట్ మిషన్ అన్న నాని..!

కృష్ణగాడి వీర ప్రేమ గాథ అంటూ వచ్చే నెల మొదటి వారంలోనే రాబోతున్నాడు నాచురల్ స్టార్ నాని. నిన్న ఆడియో జరుపుకున్న ఈ సినిమా ఆడియోకి కూడా మంచి స్పందన వస్తుంది. అసలే సూపర్ స్టార్ వచ్చి మరి నానికి, 14 రీల్స్ కి విశెష్ చెప్పి వెళ్లాడు. లాస్ట్ ఇయర్ భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాని మరోసారి అలాంటి హిట్ కోసమే చూస్తున్నాడు. అయితే తన సినిమాలో నటించిన ఇంతకుముందు హీరోయిన్స్ తో కూడా క్లోజ్ గా ఉండే నాని భలే మగాడు హీరోయిన్ నందన అదేనండి లావణ్యతో మంచి స్నేహంగా ఉంటున్నాడు.

నిన్న ఆడియో వేడుక సందర్భంగా నాని గురించి అమ్మడు పొగడ్తల వర్షం కురిపించింది. నాని కృష్ణగాడి వీర ప్రేమగాథ ట్రైలర్ బాగుంది.. సినిమా భలే భలే మగాడివోయ్ లానే మరో బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అని ట్వీట్ చేసింది లావణ్య. అయితే నాని కూడా అదే రేంజ్ సమాధానం ఇచ్చాడు. లావణ్య.. నువ్వో హిట్ మిషన్ వి.. నా సినిమాలో కూడా ఓ గెస్ట్ రోల్ చేయొచ్చుగా అన్నాడు. లాస్ట్ ఇయర్ భలే భలే మగాడివోయ్ హిట్ మేనియాను కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం సోగ్గాడితో హిట్ కొట్టింది అందాల రాక్షసి. అందుకే లావణ్యను హిట్ మిషన్ అంటూ సంభోదించాడు నాని.. హిట్ సినిమా పెయిర్ గా ఈ ఇద్దరు మాట్లాడుకున్న ట్విట్టర్ సంభాషణలు చూస్తే వీరిద్దరు మళ్లీ కలిసి చేసినా చేసేస్తారు అనిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close