ఎన్టీఆర్‌ టెర్రిఫిక్‌ పెర్‌ఫార్మెన్స్‌కి ఇంప్రెస్‌ అయిన సెన్సార్‌ సభ్యులు!

ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో..’ ఎట్టకేలకు సెన్సార్‌ వరకు వచ్చింది. మొన్నటి వరకు అసలు జనవరి 13న ఈ చిత్రం రిలీజ్‌ వుంటుందా? లేదా? అనే చర్చలు టాలీవుడ్‌ అంతా జరిగాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ వివాదంతో రెండు రాష్ట్రాలు అల్లకల్లోలం అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో ‘నాన్నకు ప్రేమతో’ పోస్టర్లను తగలబెట్టడమే కాకుండా ఆ పోస్టర్‌తో ముస్లిమ్స్‌ అంతా ఎన్టీఆర్‌ డౌన్‌ డౌన్‌ అంటూ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం మత పెద్దల జోక్యంతో, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ క్షమాపణతో ఆ వివాదానికి తెరపడింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఎలా వుండబోతోంది? ఎన్టీఆర్‌ తన కొత్త సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చెయ్యబోతున్నాడు? ఎలాంటి భారీ ఓపెనింగ్స్‌ సాధించబోతున్నాడు? అనే విషయాలపై డిస్కషన్స్‌ మొదలయ్యాయి. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రంలోని కంటెంట్‌కి, ఎన్టీఆర్‌ టెర్రిఫిక్‌ పెర్‌ఫార్మెన్స్‌కి చాలా ఇంప్రెస్‌ అయిన సెన్సార్‌ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. మరో పక్క ఈ చిత్రాన్ని మొదటిరోజే చూసెయ్యాలని ఉత్సాహంతో వున్న ప్రేక్షకులు, అభిమానుల అడ్వాన్స్‌ బుకింగ్స్‌తో మొదటిరోజు అన్ని షోలు హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న ఈ ‘నాన్నకు ప్రేమతో’ ఎంతవరకు ప్రేక్షకుల, అభిమానుల ప్రేమను పొందుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close