లండన్‌లోని చారిత్రాత్మక వెస్ట్‌మినిస్టర్ హాల్లో జరిగిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025’ అవార్డు వేడుకలో నారా దేవాన్ష్‌కు ప్రత్యేక అవార్డు లభించింది. ‘వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్ – 175 పజిల్స్’ విభాగంలో అతడు సాధించిన ప్రపంచ రికార్డుకు ఈ గుర్తింపు లభించింది.
దేవాన్ష్ ఈ రికార్డును 2024 డిసెంబర్ 18న హైదరాబాద్‌లో ‘చెక్ మేట్ మారథాన్’ లో 175 చెక్ మేట్ సవాళ్లను (పజిల్స్) కేవలం 11 నిమిషాల 59 సెకన్లలో పరిష్కరించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ సంస్థ ఈ రికార్డును ధృవీకరించి, అధికారిక సర్టిఫికెట్ అందించింది. ఈ సాధనలో దేవాన్ష్ చూపిన ధైర్యం, ఏకాగ్రత, వేగం అందరినీ ఆశ్చర్యపరిచాయి.
వెస్ట్‌మినిస్టర్ హాల్, బ్రిటన్ పార్లమెంట్‌కు చెందిన ప్రసిద్ధ స్థలం, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బుక్ రికార్జులు సాధిచిన వారికి అవార్డులు ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక వేదిక. దేవాన్ష్‌కు అవార్డు, సర్టిఫికెట్ , ట్రోఫీలు అందజేశారు. నారా దేవాన్ష్ 9 ఏళ్ల వయసులోనే చెస్ రంగంలో అసాధారణ ప్రతిభ చూపుతున్నాడు.
దేవాన్ష్ చెస్ డొమైన్లో ఇప్పటికే మరో రెండు ప్రపంచ రికార్డులు సాధించాడు. వేగవంతమైన టవర్ ఆఫ్ హనాయ్ సాల్వర్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పరిష్కరించి రికార్డు నెలకొల్పాడు. వేగవంతమైన చెస్ బోర్డ్ అరేంజర్ గా కూడా నారా దేవాన్ష్ రికార్డు సృష్టించారు. ట్విట్టర్లో చంద్రబాబునాయుడు.. నారా దేవాన్ష్‌ను అభినందించారు.