దేశభవిష్యత్ యువనేతల్లో నారాలోకేశ్ అత్యంత కీలకంగా మారారు. ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా పార్టీలకు అతీతంగా యువనేతలు ఆయనతో సమావేశం అయి రాజకీయ అంశాలతో పాటు దేశానికి సంబంధించిన పలు అంశాలపై మేథోమథనం చేస్తూంటారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ తో తేజస్వీ సూర్య సహా అనేక మంది యువ ఎంపీలు సమావేశమయ్యారు. తమ సమావేశం గురించి తేజస్వీ సూర్యనే చెప్పారు. నారా లోకేష్ ఇప్పుడు దేశవ్యాప్త యువనేతల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న నాయకుడిగా మారారు. తమిళనాడు నుంచి బీహార్ వరకూ మిత్రపక్షాల తరపున ప్రచారానికి ఆయనకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో పెరుగుతున్న నారా లోకేష్ ఇమేజ్‌కు నిదర్శనం.
ఓ విజన్ ఉన్న నాయకుడిగా లోకేష్‌కు గుర్తింపు
నారా లోకేష్ ఇటీవల ఢిల్లీ పర్యటనలు కేవలం రాజకీయ మర్యాదపూర్వక భేటీలకే పరిమితం కాకుండా, దేశ భవిష్యత్తుపై మేధోమథనం చేసే వేదికలుగా మారుతున్నాయి. ముఖ్యంగా తేజస్వీ సూర్య వంటి భావి భారత యువ నేతలు లోకేష్‌తో భేటీ కావడం, ఆ వివరాలను స్వయంగా వారే సోషల్ మీడియాలో పంచుకోవడం గమనార్హం. పార్టీల సరిహద్దులు దాటి యువ ఎంపీలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారంటే, జాతీయ స్థాయిలో ఆయన ఆలోచనలకు, పనితీరుకు లభిస్తున్న గుర్తింపును ఇది స్పష్టం చేస్తోంది. లోకేష్‌ను ఇతర యువనేతల కన్నా భిన్నంగా చూపించే అంశం టెక్నాలజీ , అడ్మినిస్ట్రేషన్ పై ఆయనకున్న పట్టు. స్టాన్ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదువుకున్న అనుభవం, గ మంత్రిగా ఆయన సాధించిన ఫలితాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి,యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలపై ఆయన చేసే విశ్లేషణలు ఇతర రాష్ట్రాల యువనేతలను సైతం ఆకట్టుకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా యువతలోనూ గుర్తింపు
ప్రస్తుతం లోకేష్ ఇమేజ్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. తమిళనాడు నుంచి బీహార్ వరకు వివిధ మిత్రపక్షాల అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి లోకేష్ కావాలని కోరుకుంటుండటం ఆయన పెరుగుతున్న క్రేజ్‌కు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా తన సందేశాన్ని సమర్థవంతంగా చేరవేయగలగడం, యువతతో కనెక్ట్ అవ్వడం ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారింది. జాతీయ కూటమిలో ఆయన ఒక కీలకమైన కమ్యూనికేటర్ గా అవతరిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దేశాన్ని నడిపించే యువనేతల్లో లోకేష్ కీలకం
రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి తనను తాను నిరూపించుకున్నారు. ఆ యాత్ర ద్వారా సంపాదించుకున్న పరిణతి ఇప్పుడు ఆయన ప్రసంగాల్లో, నిర్ణయాల్లో కనిపిస్తోంది. అతిశయోక్తులకు పోకుండా, వాస్తవాలకు దగ్గరగా ఉంటూ అభివృద్ధి గురించి మాట్లాడే ఆయన శైలికి జాతీయ స్థాయి నేతలు ఫిదా అవుతున్నారు. నారా లోకేష్ ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ వారసుడి స్థాయి నుండి దేశవ్యాప్త యువనేతల్లో ఒక ముఖ్యమైన శక్తిగా ఎదుగుతున్నారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో పోషించిన కీలక పాత్రను స్ఫూర్తిగా తీసుకుంటూనే, ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక ఆలోచనలతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇదే నిలకడను కొనసాగిస్తే, రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల గమనాన్ని శాసించే యువ నేతల్లో లోకేష్ అగ్రభాగాన నిలవడం ఖాయం.


