నారా లోకేష్.. ఇప్పుడీ పేరు దేశ పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఓ హాట్ టాపిక్. చాలా మంది శభాష్ అంటూ మరికొంత మంది కుళ్లుకుంటూ ఆయన పేరును ప్రస్తావించి తమ అభిప్రాయాలు చెబుతున్నారు. రాష్ట్రం సంగతి పక్కన పెడితే ఇతర రాష్ట్రాల్లో నారా లోకేష్ కు వచ్చిన ఇమేజ్ మాత్రం భిన్నమైనది. 99 శాతం ఆయన పనితీరును, అప్రోచ్‌ను అభినందించేవారే. పారిశ్రామిక దిగ్గజాలు, అనలిస్టులు, బిజినెస్ ఇన్ ఫ్లూయన్సర్లు,పొలిటికల్ ట్రెండ్స్ ఎనాలసిస్ చేసేవారు అంతా.. లోకేష్ స్ట్రాటజిక్ ప్రయత్నాలను అభినందిస్తున్నారు. యువ నేతల్లో ఓ అద్భుతమైన టాలెంట్ ఉన్న.. దేశానికి ఎంతో ఉపోయగపడే నాయకత్వం ఇవ్వగలవారిలో ఒకరిగా గుర్తిస్తున్నారు.
రాజకీయ పరిమితుల దృష్ట్యా నారా లోకేష్ ను పొగిడేందుకు కొంత మందికి మనసు రాదు. కానీ ఉత్తరాది నుంచి.. కర్ణాటక నుంచి.. తమిళనాడు నుంచి నారా లోకేశ్ పనితీరుతో … తమ రాష్ట్రాల మంత్రుల పనితీరును పోల్చుకుని ట్వీట్లు చేస్తున్న అక్కడి ప్రజలు, ప్రముఖుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రం కోసం నిబద్ధతతో పని చేస్తున్న ఆయన శైలిని ప్రశంసిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను పక్కాగా నిర్వహిస్తున్న ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సలహాలిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ పెరిగిపోతోంది.
తమ పనితీరును లోకేష్ తో పోల్చి నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూండటంతో ప్రియాంక్ ఖర్గే వంటి నేతలు అసహనానికి గురవుతున్నారు. ఆయనతో పోల్చి తమను కించపరుస్తున్నారని.. ఫీలవుతున్నారు. ఏపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యల వల్ల లోకేష్ కు మరింత ప్రచారం లభిస్తోంది. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ సీఈవోగా ఉన్నప్పటికీ.. డేటాసెంటర్ చెన్నైకు కాకుండా.. విశాఖకు తీసుకెళ్లడం నారా లోకేష్ పనితనమని.. డీఎంకే ఎందుకు విఫలమయిందన్న ప్రశ్నలు ఆ ప్రభుత్వానికి వస్తున్నాయి
రాజకీయరంగం, వ్యాపారరంగాలను నిశితంగా పరిశీలించి ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు చెప్పే ప్రముఖులు .. నారా లోకేష్ పనితీరును అభినందించకుండా ఉండలేకపోతున్నారు. రాజకీయ రంగంలో ఇలాంటి నిబద్ధత కలిగిన యువనేత ఉండటంతో.. యువతకు నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు. మొత్తంగా నారాలోకేశ్.. ఢిల్లీ సర్కిళ్లకు ఇప్పుడు హాట్ ఫేవరేట్ అయ్యారు.