ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నారా లోకేష్ దాదాపుగా గంట సేపు సమావేశం అయ్యారు. జీఎస్టీ రేషనలైజేషన్ చేసిన విధానం అద్భుతమని, ప్రజల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని ప్రధానికి చెప్పారు.అదే సమయంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు నిర్ణయంపై మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంలో వస్తువులపై జీఎస్టీ తగ్గించడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి లోకేష్. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు, విద్యావేత్తలు లాభపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ భేటీ సమయంలో ప్రధాని మోదీకి యోగాంధ్రపై రూపొందించిన పుస్తకాన్ని అందించారు. పుస్తకం యోగాంధ్ర ప్రాంతం, అక్కడి సంస్కృతి, చరిత్ర, ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ రూపొందించారు. నిజానికి యోగాంధ్ర సక్సెస్ పై ప్రధాని మోదీ కేస్ స్టడీ చేయాలని కేంద్ర కేబినెట్ లోనూ ప్రస్తావించారు. అందుకే స్వయంగా ఈ అంశంపై నివేదిక తరహాలో నారా లోకేష్ పుస్తకం తయారు చేసి ప్రధాని మోదీకి అదంించారు.
ఈ భేటీ సమయంలో పెండింగ్ ప్రాజెక్టుల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ, నారా లోకేష్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు సహకారంపైనా కృతజ్ఞచలు తెలిపారు. మే 17న తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి నారా లోకేష్ మోదీని కలిశారు. అనంతరం 4 నెలల వ్యవధిలోనే నారా లోకేష్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీని కలిశారు.