క్రికెట్ స్టేడియాలో పెవిలియన్లు, స్టాండ్లకు స్టార్ క్రికెటర్ల పేర్లు పెడతారు. అయితే ఆ స్టార్ క్రికెటర్లు మగవాళ్లే అయి ఉంటారు. ఇప్పటి వరకూ మహిళా దిగ్గజాల పేర్లు పెట్టలేదు. ఇదే విషయాన్ని ఆగస్టు నెలలో జరిగిన ‘బ్రేకింగ్ బౌండరీస్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ను.. మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ప్రశ్నించారు. ఆ ప్రశ్నను మనసులో పెట్టుకున్న నారా లోకేష్ .. ఇప్పుడు అవకాశం రాగానే.. చేతలతో స్మృతి మంధాన ప్రశ్నకు జవాబు చెబుతున్నారు.
విశాఖ స్టేడియంలో రెండు స్టాండ్లకు మహిళా క్రికెటర్లు.. మిథాలీ రాజ్, రవి కల్పన పేర్లు పెట్టారు. స్టేడియాల్లో పురుష క్రికెటర్ల పేర్లతో ఎన్నో స్టాండ్స్ ఉన్నా, మహిళా క్రికెటర్లకు అలాంటి గుర్తింపు దక్కడం లేదని ..మహిళల విజయాలను గుర్తించి, వారి పేరుతో స్టాండ్స్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది అమ్మాయిలకు అది స్ఫూర్తినిస్తుందన్న మాటలను లోకేష్.. అప్పటికి విని మర్చిపోలేదు. కార్యాచరణ కూడా ఖరారు చేశారు.
వైజాగ్ స్టేడియంలోని ఆ కొత్త స్టాండ్లను అక్టోబర్ 12న, ఇండియా-ఆస్ట్రేలియా మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా ప్రారంభించనున్నారు. వీటిలో రెండు స్టాండర్లు ఇద్దరు మహిళా క్రికెటర్ల పేర్లను స్టాండ్లకు పెట్టడం ద్వారా లోకేష్ మహిళా క్రికెటర్లకు స్ఫూర్తినివ్వనున్నారు. మిథాలీ రాజ్ ఇండియన్ విమెన్ క్రికెట్కు ఓ ఐకాన్. రవి కల్పన… ఓ సామాన్య కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారిణి. వీరికి అరుదైన గౌరవం కల్పిస్తున్నారు.