మన దగ్గర గొప్ప టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆ టాలెంట్ ఎవరికి అవసరమో వారికి తెలిసేలా చేయాలి. వారి వద్ద నుంచి అవకాశాలు పొందాలి. అప్పుడు మాత్రమే ఆ టాలెంట్ కు సార్థకత. ఐయామ్ ఏ టాలెంటెడ్ పర్సన్. అందరూ వచ్చి అవకాశాలు ఇవ్వాలని ఇంట్లో కూర్చుంటే..ఎప్పటికీ అక్కడే ఉంటారు. అది మనుషులు అయినా.. రాష్ట్రం అయినా సరే. ఏపీకి ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. పెద్ద తీరం ఉంది. సమర్థవంతమైన నాయకత్వం ఉంద. బోలెడంత మ్యాన్ పవర్ ఉంది. అయినా ప్రయత్నం చేయకపోతే ఇన్వెస్టర్లు ఎవరూ రారు. మా దగ్గర ఇన్ని అవకాశాలు ఉన్నాయి…ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. అవి మీ అవసరాలు తీరుస్తాయి..అని ఒప్పించగలిగితే వస్తారు. నమ్మించగలిగితే వస్తారు. మంత్రి నారా లోకేష్ అదే చేస్తున్నారు.
సప్త సముద్రాలు దాటి ఏపీ మార్కెటింగ్
నారా లోకేష్ చాలా బిగ్ టార్గెట్ పెట్టుకున్నారు. ఐదు సంవత్సరాల్లో స్పష్టమైన మార్పు చూపించాలనుకుంటున్నారు. పారిశ్రామికంగా ఏపీని ఉన్నత స్థానంలో నిలబెట్టి ఇరవై లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించాలనుకుంటున్నారు. ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలతో సాధ్యమయ్యే పనులు కాదు. ఓ భారీ కంపెనీని తీసుకు వచ్చి ఓ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయగలిగితే.. తర్వాత వాటంతటకు అవే పరిశ్రమలు వస్తాయి. అందుక అలాంటి దిగ్గజాల కోసమే నారా లోకేష్ సప్త సముద్రాలు దాటి ఏపీని మార్కెట్ చేస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు అమెరికా వెళ్లారు. యూకే, కెనడా వెళ్లారు. దావోస్ లాంటి చోట్లకు ఎప్పుడు అవకాశం వచ్చినా వెళ్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ గురించి చక్కని ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు వారికి పెట్టుబడుల ఆలోచనలు లేకపోయినా.. రేపు అలాంటి ఆలోచన వస్తే..మొదటగా ఎపీని గుర్తు పెట్టుకునేలా చేస్తున్నారు.
మార్కెటింగ్ వ్యూహం.. వారి దృష్టిలో పెట్టడమే !
డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేవాళ్లు వస్తారు. వారి లక్ష్యం ప్రతి ఒక్కరితో కొనిపించడం కాదు. తమ ఉత్పత్తి గురించి తెలిసేలా చేయడమే. అలా ఓ వ్యక్తి వచ్చి ఆ ఉత్పత్తి గురించి చెప్పినప్పుడు.. రేపు ఎప్పుడైనా ఆ విభాగంలో వస్తువు అవసరం అయితే ఆ ఉత్పత్తే కొనుగోలుదారుకు గుర్తుకు వస్తుంది. దాన్నే కొనుగోలు చేస్తాడు. అంటే మార్కెటింగ్ చేసిన వ్యక్తి మెదడులో నాటేసిపోయాడన్నమాట. అలాంటి మార్కెటింగ్ ఇప్పుడు నారా లోకేష్ ఏపీ కోసం చేస్తున్నారు. దిగ్గజ పరిశ్రమల వద్ద ఏపీకి సంబందించిన ప్రపోజల్స్ ఎప్పటికప్పుడు రెడీగా ఉంటున్నాయి. మంచి రాయితీలు.. ఎకో సిస్టమ్.. లైసెన్స్ రాజ్ అనేది లేకుండా.. రెడ్ కార్పెట్ వేస్తామని సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటివి భవిష్యత్ లో ఆయా కంపెనీలను ఏపీ వైపు నడిపిస్తాయి.
అమెరికా, కెనడా పర్యటనలు సూపర్ సక్సెస్
నారా లోకష్ అమెరికా, కెనడాల్లో ఆరు రోజుల పాటు పర్యటించారు. సత్యనాదెళ్ల సహా దిగ్గజ కంపెనీల ప్రముఖులను కలిశారు. పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఆయన పర్యటన సూపర్ సక్సెస్ అయింది. కెనడాలోనూ ఏపీ గురించి ప్రచారం చేశారు. చాలా కంపెనీల ప్రతినిధులు.. తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ను కూడా చేర్చుకున్నాయి. నారా లోకేష్ వ్యూహాత్మకంగా ఆయా కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఇండియన్స్ తో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకునే యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో అది కనిపిస్తుంది.
