నారా రోహిత్‌, శ్రీ‌విష్ణు.. ఓ చారిత్ర‌క క‌థ‌

నారా రోహిత్‌, శ్రీ‌విష్ణు మంచి స్నేహితులు. ఇద్ద‌రి ప్ర‌యాణం ఒకేలా మొద‌లైంది. ఒకేలా సాగుతోంది. శ్రీ‌విష్ణు సినిమాల‌కు నారా రోహిత్ నిర్మాత‌గానూ వ్య‌హ‌రించాడు. ఇద్ద‌రూ క‌ల‌సి చాలా సినిమాల్లో న‌టించారు కూడా. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. ఇదో చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న క‌థ. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ప‌రిచ‌యం కాబోతున్నాడు. మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి శ్రీ‌విష్ణు, నారా రోహిత్ ఇద్ద‌రూ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలుస్తోంది. శ్రీ‌విష్ణు సినిమా ‘తిప్ప‌రా మీసం’ ఈ వార‌మే విడుద‌ల కానుంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జ‌రిగింది. ఈరోజు విడుద‌ల చేసిన ట్రైల‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగానే క‌నిపిస్తోంది. ‘బ్రోచేవారెవ‌రురా’తో ఓ విజ‌యాన్ని అందుకున్న శ్రీ‌విష్ణు.. అదే జోరు ఈ సినిమాలోనూ చూపిస్తాడేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close