‘నిశ్శ‌బ్దం’ టీజ‌ర్‌: హంత‌కుడు ఎవ‌రు?

క్ష‌ణం, ఎవ‌రు లాంటి విజ‌యాల‌తో థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు మ‌రింత హైప్ వ‌చ్చింది. స్టార్లు లేకుండానే హిట్లుగా నిలిచిన చిత్రాల‌వి. అలాంటి క‌థ‌ల‌కు స్టార్ తోడైతే..? నిశ్శ‌బ్దంలో అదే జ‌రుగుతోంది. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. అనుష్కకు మాధ‌వ‌న్, అంజ‌లి, షాలినీ పాండే లాంటివాళ్లు తోడ‌య్యారు. ఇదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స్టోరీ. ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ. ఓ జంట విహార యాత్ర‌కు వెళ్తుంది. అక్క‌డ అనుకోని ప్ర‌మాదంలో భ‌ర్త మ‌ర‌ణిస్తాడు. అదో హ‌త్య‌. ఆ హ‌త్య ఎవ‌రు చేశార‌న్న అంశం చుట్టూ క‌థ న‌డుస్తుంది. అనుష్క పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. ప‌రిమిత మైన లొకేష‌న్ల మ‌ధ్య ఈ సినిమాని తెర‌కెక్కించారేమో అనిపిస్తోంది. ఓ ఫామ్ హౌస్ నేప‌థ్యంలో ఎక్కువ షాట్లు చూపించారు. ఈ సినిమాకి ఇచ్చిన క‌ల‌ర్ టోన్ చాలా వినూత్నంగా ఉంది. హాలీవుడ్ ప్ర‌మాణాల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామ‌ని చిత్ర‌బృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. కొంత‌మంది హాలీవుడ్ న‌టులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం ప‌ని చేశారు. టీజ‌ర్ అయితే ఆక‌ట్టుకుంటోంది. పేరుకి త‌గ్గ‌ట్టే ఒక్క డైలాగ్ కూడా లేకుండానే టీజ‌ర్‌ని క‌ట్ చేశారు. ఈ సినిమాలో అనుష్క ప్ర‌మాద‌వ‌శాత్తూ గొంతుని పోగొట్టుకుంటుంది. త‌న పాత్ర‌కు మాట‌లే ఉండ‌వు. అందుకే ఈ పేరు పెట్టారేమో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.