హ‌మ్మ‌య్య‌… కాస్త స్లిమ్ అయ్యాడు

నారా రోహిత్ డిక్ష‌న్ అమోఘంగా ఉంటుంది. దానికి తోడు మంచి న‌టుడు. కొత్త క‌థ‌ల్ని ధైర్యంగా ఎంచుకొంటాడు. కానీ ఒకటే లోపం. ఈమ‌ధ్య బాగా… బాగా… వ‌ళ్లు చేసేశాడు. నారా రోహిత్‌ని పెద్ద తెర‌పై చూడ్డం క‌ష్టంగా మారుతోంది. హీరో మ‌రీ ఇంత బొద్దుగా ఉంటే ఎలా..?? అనిపిస్తుంది. క‌థ‌లోంచి, ఆ పాత్ర‌లోంచి డైవ‌ర్ట్ అయిపోయే ప‌రిస్థితి వ‌స్తోంది. ఈ విష‌యం రోహిత్ కూడా గ‌మ‌నించాడు. అందుకే.. ఈమ‌ధ్య ఒంటిపై శ్ర‌ద్ద పెట్టాడు. త‌న తాజా చిత్రం `బాల‌కృష్ణుడు` కోసం సిక్స్ ప్యాక్ చేసే లెవిల్లో బాడీ చూపించ‌బోతున్నాడు. అందుకు త‌గ్గ వ్యాయామాలు మొద‌లెట్టాడు. ప‌వ‌న్ మ‌ల్లెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. ఇందులోని మ‌రో స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో… రోహిత్ స్లిమ్‌గా క‌నిపిస్తున్నాడు. రెజీనా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడు. షూటింగ్ దాదాపుగా పూర్త‌యిన‌ట్టే. ఈ విజ‌య ద‌శ‌మికి టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నుంది చిత్ర‌బృందం. ఇటీవ‌లే.. క‌థ‌లోరాజ‌కుమారితో ఓ ఫ్లాప్ మూట‌గ‌ట్టుకొన్నాడు రోహిత్‌. ఈసారి ఈ బాల‌కృష్ణుడు ఏం చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close