మ‌రో ‘బాణం’ దిగ‌బోతోంది

‘బాణం’ తో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు నారా రోహిత్‌. ఆసినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. కానీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకొంది. తెలుగు ద‌ర్శ‌కులు కొత్త‌గా ఆలోచిస్తున్నార‌ని,మూలాల్లోకి వెళ్ల‌గ‌లుగుతున్నార‌ని ఆసినిమాతో నిరూపించాడు చైత‌న్య దంతులూరి. టేకింగ్‌, పాత్ర‌ల్ని మ‌లిచే విధానం.. ఇవ‌న్నీ ఆక‌ట్టుకొన్నాయి. ఎమోష‌న్స్‌ని తారాస్థాయిలో చూపించే విష‌యంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. నారా రోహిత్‌పై గౌర‌వం, న‌మ్మ‌కం క‌లిగాయి. ఇప్పుడు ఈ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపుద్దిద్దుకోబోతోంది.

అవును.. ‘బాణం’ కాంబోలో మ‌రో సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. బాణం త‌ర‌వాత చైత‌న్య దంతులూరి ‘బ‌సంతి’ అనే సినిమా తీశాడు. అది స‌రైన‌ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. దాంతో చైత‌న్య‌కు గ్యాప్ వ‌చ్చేసింది. ఈలోగా ఓ మంచి క‌థ త‌యారు చేసి, నారా రోహిత్‌కి వినిపించాడ‌ట‌. అది రోహిత్‌కి బాగా న‌చ్చింద‌ని తెలుస్తోంది. అతి త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని స‌మాచారం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. రోహిత్ ప్ర‌స్తుతం పండ‌గ‌లా దిగి వ‌చ్చాడు, క‌థ‌లో రాజ‌కుమారి సినిమాల్లో న‌టిస్తున్నాడు. వీటి త‌ర‌వాతే… ‘బాణం 2’ సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close