“ఆ” కేసులో నారాయణకు ఊరట.. పట్టించుకోని చంద్రబాబు !

చంద్రబాబును ఏ వన్‌గా నారాయణ ఏ – 2గా చేర్చి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేసించింది. మాజీ మంత్రి నారాయణ సహా పలు సంస్థలకు ఊరట లభించింది. ఈ విషయమై ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణతో పాటు లింగమనేని సంస్థలు, రామకృష్ణ రియల్ ఏస్టేట్ సంస్థలు ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకొన్నాయి. ఈ విషఁయమై విచారణ నిర్వహించిన హైకోర్టు జూన్ 9వ తేదీ వరకు వీరిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే చంద్రబాబు మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు.

అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చేసి అక్రమాలకు పాల్పడ్డారని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు మేలు చేశారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి సాక్ష్యాలున్నందున కేసు నమోదు చేశామనిసీఐడీ ప్రకటించింది. హైదరాబాద్‌లో నారాయణను అరెస్ట్ చేసిన రోజున ఎందుకు అరెస్ట్ చేశారో ముందు చెప్పలేదు . అయితే మొదట ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు బయటకు వచ్చింది. దీంతో ఆ కేసులో అరెస్ట్ చేశారేమో అనుకున్నారు. కానీ చివరికి వ్యూహం మార్చి పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ చేశారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆయనకు అప్పుడే బెయిల్ లభించింది.

అసలు ఇన్నర్ రింగ్ రోడే నిర్మాణం కాలేదు. కనీసం అంగుళం కూడా భూమిని సేకరించలేదు. ఇక్కడ ఎవరికీ లబ్ది అనే ప్రశ్నే రాదు. పైగా అలైన్ మెంట్ ఖరారు కోసం అన్ని రకాల నిబంధనలు పాటించారు. అయినప్పటికీ ఏదోకేసు పెట్టాలి కాబట్టి పెట్టినట్లుగా ఉండటంతో … సీఐడీ తీరుపై మొదట్లోనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత సీఐడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే పోలీసులు ఏ అర్థరాత్రో వచ్చి అరెస్ట్ చేసే ప్రమాదం ఉన్నందున.. అందులో ఉన్న వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close