బలమైన నాయకత్వం ఉంటే అది కుటుంబానికి అయినా.. సంస్థకు అయినా.. దేశానికి అయినా ప్లస్ పాయింట్. ఎలాంటి పరిస్థితుల్లోనూ కంగారు పడకుండా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటే విజయాలే తప్ప అపజయాలు ఉండవు. ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీది అద్భుతమైన నాయకత్వం. ఉగ్రదాడులు జరిగినప్పటి నుండి ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వ్యవహరించిన విధానం.. అవసరం అయితే తొణకకుండా.. బెణకకండా కఠిన నిర్ణయాలు తీసుకునే స్థితప్రజ్ఞత ఆయన సొంతం అని తెలిసేలా చేసింది.
తొణకకుండా బెణకకుండా నిర్ణయాలు
ప్రధాని మోదీ సౌదీలో ఉన్నప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఆయన వెంటనే వచ్చారు. ఎయిర్ పోర్టులోనే సమావేశం అయ్యారు. కానీ ఆవేశపడలేదు. అదే రోజులు పాకిస్తాన్ పై దాడులు చేయాలనుకోలేదు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారి తీస్తాయని ఆయనకు బాగా తెలుసు. అందుకే.. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేలా చూసుకున్నారు. ఉగ్ర క్యాంపులు.. వాటిపై ఎలా దాడి చేయాలో ప్రణాళికలు వేసుకున్నారు. ముఖ్యమైన ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉంటారో కూడా సమాచారం వచ్చేదాకా చూసుకున్నారు. పాకిస్తాన్ కు ఎలాంటి సమాధానం పంపాలో అలాంటి సమాధానం పంపేవారకూ ఆయన తొణకలేదు. ఎక్కడా ఓ ప్రకటన కూడా చేయలేదు.
భయం కలిగించకుండా అప్రమత్తత
ఉగ్రవాదుల్ని ఉపేక్షిస్తే.. వారు తర్వాత కశ్మీర్ అంతా అల్లుకుపోయే ప్రమాదం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కలుగుల్లోకి వెళ్లిపోయినవారు ఇప్పుడు బయటకు వస్తున్నారు. వారు మళ్లీ ఆయుధాలతో రెచ్చిపోతే కట్టడి చేయడం అసాధ్యం అవుతుంది. అందుకే మొక్కగా ఉన్నప్పుడే తెంపాలనుకున్నారు. అయితే ప్రతిఘటన ఉండకుండా ఉండదు. అందుకే భారత పౌరుల్ని ప్రధాని నాయకత్వంలో రెడీ చేశారు. సివిల్స్ మాక్ డ్రిల్స్ నిర్వహింపచేశారు. అయితే ఇవన్నీ ఒక్కరిలోనూ భయం పుట్టించలేదు. అంతా తమ బాధ్యతగా తీసుకున్నారు. అక్కడే ప్రధాని నిర్ణయాల్లో ఉన్న మ్యాజిక్ బయటపడుతుంది. దేశ ప్రజలకు భయం అనేది లేకుండా.. అప్రమత్తంగా ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
బలమైన నాయకత్వం ప్లస్ పాయింట్
మోదీ బలమైన నాయకుడు. దేశంలో ఆయన చేసే రాజకీయాల పట్ల చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండి ఉండవచ్చు. కానీ దేశం కోసం ఆయన తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన ఎంత బలంగా ఉంటారో చాలా సార్లు బయటపడింది. ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది. అదే ఇతరులు అధికారంలో ఉంటే.. భారత్ స్పందన చాలా బలహీనంగా ఉండేది. అమ్మో ఏం చేస్తారో అని కంగారు పడేవారు. మోదీ ధైర్యానికి కారణం భారత ప్రజలు ఆయన పై పెట్టుకున్న నమ్మకం.. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకమే మోదీ దైర్యం.