ఏపీకిచ్చిన నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..? యాప్ నుంచి మోడీ ప్రశ్న..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిజంగానే పని పడిందో… నిఘా నివేదికలే భయపెట్టాయో కానీ… మోడీ.. ఈ నెల ఆరో తేదీన ఏపీకి రావాలనుకున్న పర్యటనను వాయిదా వేసుకున్నారు. కానీ ఏపీ కార్యకర్తలతో మాత్రం మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. మోడీ యాప్ ద్వారా ఏపీ బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, మ‌చిలిప‌ట్నం, న‌ర‌సాపురం, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం లోక్‌సభ స్థానాలకు చెందిన బూత్‌ కమిటీ కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో.. కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

బీజేపీకి సిట్టింగ్ ఎంపీ ఉన్న విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు.. మోడీ ఏపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. రూ. 20 వేల కోట్ల వరకు రిసోర్స్‌ గ్యాప్‌, రెవెన్యూ డెఫిసిట్‌ ఫండ్‌గా విడుదల చేశామని చెప్పుకొచ్చారు. ఆ డ‌బ్బు ఎవ‌రి జేబుల్లోకి వెళ్ళిందని మోడీ ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చామని, ఏపీ ప్రభుత్వం యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఇవ్వలేదని తేల్చేశారు. పోల‌వ‌రాన్ని జాతీయ ప్రాజెక్టుగా తమ ప్రయ‌త్నంతోనే ప్రక‌టించారని, పోలవరానికి వంద‌శాతం కేంద్రం డబ్బులు ఇస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు పోలవరానికి రూ. 7 వేల కోట్లు ఇచ్చామని .. ప్రాజెక్ట్‌ను ఏపీ సరిగ్గా నిర్మించలేకపోతోందని… కాగ్‌ చెప్పిందని చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోడీ తమ కార్యకర్తలతో మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఏపీ ప్రభుత్వం ఈ విధంగా చేసి ఉంటే… ఎలాంటి స్టెప్ వేయడానికైనా… కేంద్రానికి అధికారం ఉంది. కానీ… ప్రధాని స్థాయిలో ఉండి కూడా.. కార్యకర్తల ఎదుట రాజకీయ విమర్శలే చేశారు.

పోలింగ్‌బూత్‌ల వ్యూహాలను.. పార్టీ కార్యకర్తలకు వినిపించారు . 23 పాయింట్లను బూత్‌ కార్యకర్తలు పాటించాలన్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించారు. దేశం లోపలా, బయట భద్రతకు ప్రాధాన్యమిస్తామని చెప్పుకొచ్చారు. కేంద్రంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని యువత పట్టించుకోదని, తొలిసారి ఓటు పొందినవారిని కార్యకర్తలు కలుసుకోవాలని మోదీ సూచించారు. ఆరో తేదీన కూడా మరోసారి మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంగ్లిష్ మీడియం కోసమూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో...

కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు...

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

HOT NEWS

[X] Close
[X] Close