మోడీ ఆత్మీయపలకరింపు.. ! విజయసాయి ప్లేస్‌లో రఘురామకృష్ణంరాజు..!

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సారి హల్లో విజయ్ గారూ.. అంటూ.. విజయసాయిరెడ్డిని పలకరించిన … ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఈ సారి ఆ చాన్స్‌ను.. మరో వైసీపీ ఎంపీ… రఘురామకృష్ణంరాజుకు ఇచ్చింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ దగ్గర ఎంపీ రఘురామ కృష్ణంరాజును… అటుగా వెళ్తున్న ప్రధాని మోడీ.. ఆగి మరీ పలకరించారు. ఆప్యాయంగా మాట్లాడారు. రఘురామ కృష్ణంరాజుతో కరచాలనం చేసి భుజం తట్టారు. మోడీకి.. రఘురామకృష్ణంరాజు శిరస్సు వంచి నమస్కరించారు. అంతా బాగుందా అంటూ రఘురామకృష్ణంరాజును మోడీ క్షేమాచారాలు అడిగారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఆ సమయంలో.. రఘురామకృష్ణంరాజు పక్కన ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు కూడా ఉన్నారు.

కానీ వారెవరిపై మోడీ చూడలేదు. వారు కూడా.. మోడీని పలకరించే సాహసం చేయలేదు. విజయసాయిరెడ్డికి తెలియకుండా.. ఎవరూ ప్రధాని మోడీని కలిసే ప్రయత్నం చేయకూజదని.. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసి మరీ ఎంపీల్ని ఢిల్లీకి పంపించారు. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడకూడదన్నారు. అయితే.. రఘురామకృష్ణంరాజు.. ఇంగ్లిష్ మీడియం విషయంలో పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. జగన్ సీరియస్ అయ్యాడని మీడియాలో జరిగిన ప్రచారంతో రివర్స్ ఎటాక్ చేశారు. అయితే.. ఇంత వరకూ.. వైసీపీ పెద్దలు రఘురామకృష్ణంరాజును వివరణ కూడా అడగలేదు. ఈ లోపే ఆయనకు.. నరేంద్రమోడీ.. ఎక్కడ లేని బలం ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ అగ్రనాయకత్వం.. రఘురామకృష్ణంరాజుపై.. కనీసం కోపంగా చూసే పరిస్థితి లేదు.

బీజేపీ పెద్దలను కలవకుండా.. ఎంపీలను కట్టడి చేశారన్న ప్రచారం.. ప్రధాని మోడీ వద్దరు చేరిందని.. అందుకే ఆయన.. ఆగి మరీ… రఘురామకృష్ణంరాజును పలకరించారన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. ఎంపీగా గెలిచాక తొలి సమావేశాల్లోనే కుటుంబసమేతంగా.. మోడీతో సమావేశమయ్యారు. కొన్ని పుస్తకాలను బహుకరించారు. కేంద్రమంత్రులతోనూ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ కారణంగా ఆయనకు వైసీపీ సిఫార్సు చేయకపోయినా.. ఓ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ పదవి లభించిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు.. విజయసాయికన్నా.. రఘురామకృష్ణంరాజే..మోడీ దగ్గర పాపులయ్యారని తాజా పరిణామాలతో తేలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close