అక్కడికి చేరుకోవడానికి 54 ఏళ్ళు పట్టింది?

“అక్కడికి చేరుకోవడానికి 54 ఏళ్ళు పట్టింది” అనగానే ఏ మంగళగ్రహానికో అనేసుకొనవసరం లేదు. పొరుగునే ఉన్న దుబాయ్ కి అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారత్-దుబాయ్ ల మధ్య 700 విమానాలు తిరుగుతున్నప్పటికీ ఒక భారత ప్రధాని దుబాయ్ రావడానికి 54సం.లు పట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ చమత్కారంగా అన్నారు. అంటే ఇంతకాలం భారత్ ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దుబాయ్ మరియు గల్ఫ్ దేశాల ప్రాదాన్యతని గుర్తించడంలో విఫలమయ్యిందని ఆయన చమత్కారభరితంగా చెప్పారు. ఆ తప్పును తను దుబాయ్ పర్యటన ద్వారా సరిదిద్డుతున్నట్లు చెప్పినట్లే భావించవచ్చును.

దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ నిన్న రాత్రి నిర్వహించిన బహిరంగ సభకి హాజరయిన ప్రవాసభారతీయులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. స్టేడియం కెపాసిటీ ముప్పై వేలే అయినప్పటికీ 50,000 మంది అందులో సర్దుకొని మరీ ఆయన ప్రసంగం విన్నారు. భారత ప్రధాని దుబాయ్ రావడం ఇన్నేళ్ళు ఆలశ్యమయినప్పటికీ దుబాయ్ రాజుగారు తమ కోసం ఓపికగా వేచిచూసి, వచ్చిన తరువాత చాలా ఆదరించి, భారత్ లో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా అంగీకరించారని తెలిపి మోడీ ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ముస్లిం దేశమయిన దుబాయ్ లో హిందువుల కోసం ఒక దేవాలయం నిర్మించేందుకు స్థలం కేటాయిండం ఆయన ఔదార్యానికి గుర్తని మోడీ ఆయనని మెచ్చుకొన్నారు. ఇప్పుడు దుబాయ్ ఒక మినీ ప్రపంచంలాగ మారిపోయిందని ప్రపంచంలో అన్ని దేశాలవాళ్ళు అక్కడికి ఆకర్షితులవుతున్నారని మోడీ దుబాయ్ రాజుగారి సార్వజనిక పాలనను ప్రస్తుతించారు. అదేవిధంగా స్టేడియంలో తన ముందున్న ప్రవాస భారతీయులందరినీ చూస్తుంటే అక్కడే ఒక ‘మినీ భారత్’ ఉన్నట్లు తనకు అనిపిస్తోందని మోడీ అన్నారు.

దుబాయ్ రాజుగారు, ఆయన పరిపాలన గురించి మోడీ చెప్పిన మాటలు సభకు హాజరయిన ప్రవాసభారతీయులను ఆకట్టుకోవడం సహజమే. కానీ ఆయన పలికిన ఆ నాలుగుముక్కల వలన దుబాయ్ ప్రభుత్వం కూడా అక్కడ పనిచేస్తున్న లక్షలాది ప్రవాసభారతీయుల పట్ల మరికొంత సానుకూలంగా, సానుభూతితో వ్యవహరించవచ్చును. అలాగే భారత్ తో తన సంబంధాలను మరింత పటిష్టం చేసుకొనేందుకు ఆసక్తి చూపించవచ్చును. సాధారణంగా ఇటువంటి సందర్భాలలో ప్రధానులు ఏవో కొన్ని ఊకదంపుడు ప్రసంగాలు చేసి, కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేసేసి తమ పర్యటన విజయవంతం అయిందని చెప్పుకొంటుంటారు. కానీ ప్రధాని మోడీ మాత్రం ఆ సాంకేతిక పడికట్టు పదజాలం జోలికి పోకుండా, అనేక ఏళ్ల తరువాత దుబాయ్ వచ్చినప్పటికీ, అక్కడి ప్రభుత్వం ప్రసన్నం అయ్యేవిధంగా చాలా చక్కగా మాట్లాడుతూ తన పని చక్కబెట్టుకొని వచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close