ఏపీలో మత మార్పిళ్లపై విచారణకు ఆదేశం..!

ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడుల అంశం మళ్లీ కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ ఎస్సీ కమిషన్ ఈ అంశంపై తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా…ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఏపీలో దళితుల్ని టార్గెట్ చేసుకుని మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని..నాగరాజు అనే వ్యక్తి ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరుక ఎస్సీ కమిషన్ నుంచి.. సీఎస్‌కు తాఖీదులు వచ్చాయి. పదిహేను రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలా ఇవ్వకపోతే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏపీలో మత మార్పిళ్ల అంశంపై చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా చాలా సార్లు ఫిర్యాదు చేశారు. కొన్ని స్వచ్చంద సంస్థలు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశాయి. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై సమగ్ర నివేదికను రాష్ట్రపతి భవన్‌కు, సామాజిక న్యాయశాఖకు పంపించారు. . దీనిపై విచారణ జరపాల్సిందిగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిని … రాష్ట్రపతి ఆదేశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం పంపలేదని తెలుస్తోంది.

చాలా రోజుల నుంచే.. వైసీపీ నేతలు.. పాస్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పా‌స్టర్లతో సమావేశం పెట్టి.. మతాలను మార్చండి.. ఎవరు అడ్డు వస్తారో చూస్తామన్నట్లుగా భరోసా ఇచ్చిన వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత మరికొంత మంది ఎమ్మెల్యేల వీడియోలు కూడా వచ్చాయి. అయితే.. జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించినా.. ప్రభుత్వం నివేదిక పంపడం కష్టమే. ఒక వేళ పంపినా..ఎలాంటి మత మార్పిళ్లు లేవని నివేదిక పంపుతుంది. ఎందుకంటే.. ప్రభుత్వమే మత మార్పిళ్ల వెనుక ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇలాంటి విచారణలు.. ఫిర్యాదుల వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close